Site icon Prime9

Samsung Galaxy S23 FE 5G: సగం ధరకే సామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్.. ఈ సారి మామూలుగా ఉండదు.. అదిరిపోయింది అంతే..!

Samsung Galaxy S23 FE 5G

Samsung Galaxy S23 FE 5G

Samsung Galaxy S23 FE 5G: దీపావళి పండుగలో భాగంగా ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ ఆకర్షణీయమైన తగ్గింపులను అందుబాటులోకి తెచ్చింది. వాటిలో Samsung Galaxy S23 FE 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ప్రకటించింది. అలానే ఈ ఫోన్ 8GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను కలిగి ఉంది. ఫోన్ ప్రైమరీ కెమెరా 50 మెగా పిక్సెల్ సెన్సార్‌. దీని లాంచింగ్ ప్రైస్ 79,999 రూపాయలు. అయితే ఇప్పుడు దీనిపై 62 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ Samsung Galaxy S23 FE 5G స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు 62 శాతం డిస్కౌంట్ ప్రకటించింది. దీని ప్రకారం  8GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 29,999కి కొనుగోలు చేయచ్చు. అలానే ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులపై డిస్కౌంట్లు కూడా పొందొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4500mAh కెపాసిటీ బ్యాటరీ ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 SoC ప్రాసెసర్‌లో పనిచేస్తుంది.

Samsung Galaxy S23 FE 5G Features
ఈ స్మార్ట్‌ఫోన్ 6.4 అంగుళాల డైనమిక్ ఫుల్ HD ప్లస్ AMOLED డిస్‌ప్లేతో 1080 x 2340 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఈ డిస్‌ప్లే 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. మొబైల్ Qualcomm Snapdragon 8 Gen 1 SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 14 సపోర్ట్‌తో రన్ అవుతుంది. అలానే 8GB RAM + 256 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది.

మొబైల్‌లో ట్రిపుల్ రియర్ ఫ్లోటింగ్ కెమెరా సిస్టమ్ ఉంది. మెయిన్ కెమెరాలో 50 మెగా పిక్సెల్ సెన్సార్ ఉంది. రెండవ కెమెరా అల్ట్రా-వైడ్ లెన్స్‌తో 12-మెగాపిక్సెల్ సెన్సార్. మూడవ కెమెరాలో 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంది. ఇందులో సెల్ఫీ కోసం 10 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ పవర్ కోసం 4,500mAh కెపాసిటీ బ్యాటరీ బ్యాకప్‌ను కలిగి ఉంది. ఇది USB టైప్-సి పోర్ట్ ద్వారా 25W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ 30 నిమిషాల్లో ఫోన్‌ను సున్నా నుండి 50శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. ఇతర కనెక్టివిటీ ఎంపికలలో వైఫై, జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.3 కనెక్టివిటీ ఉన్నాయి. ఇంకా ఇది డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం IP68 రేటింగ్‌తో వస్తుంది. మొబైల్ క్రీమ్, గ్రాఫైట్, మింట్, పర్పుల్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

Exit mobile version