Site icon Prime9

iPhone 17: సూపర్ మోడల్.. ఐఫోన్ 17 వచ్చేస్తుంది.. ఈసారి రచ్చ రచ్చే..!

iPhone 17

iPhone 17

iPhone 17: ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ మార్కెట్లోకి వచ్చి చాలా కాలం కాలేదు. ఇంతలోనే ఐఫోన్ 17 మోడల్ గురించి లీక్‌లు రావడం ప్రారంభమైంది. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ అల్యూమినియం, గ్లాస్ రెండింటితో చేసిన డిజైన్‌తో వెనుక ప్యానెల్‌ను కలిగి ఉంటాయని ఒక నివేదిక పేర్కొంది.ఇది కాకుండా అనేక నివేదికలు నెక్స్ట్ జనరేషనల్ iPhone 17 మోడల్ గురించి మరిన్ని వివరాలను వెల్లడించాయి. ఇది సెప్టెంబర్ 2025లో వస్తుందని రూమర్ ఉంది. వీటి ప్రకారం 2025 సంవత్సరంలో ఆపిల్ ఈ కొత్త మోడల్‌లలో కొన్ని పెద్ద మార్పులు కనిపించవచ్చు. iPhone 17 మోడల్‌లో ఎలాంటి ప్రధాన మార్పులు జరగవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

లీక్ ప్రకారం.. ఐఫోన్ 17 మోడల్ వచ్చే ఏడాది కొన్ని పెద్ద మార్పులను చూడవచ్చు. పైన చెప్పినట్లుగా, iPhone 17 మోడల్‌లు అల్యూమినియం ఫ్రేమ్‌తో వచ్చే అవకాశం ఉంది. ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 16 ప్రో టైటానియం ఫ్రేమ్‌ను కలిగి ఉన్నాయి. ఐఫోన్ 17 మోడల్‌లు అల్యూమినియం ఫ్రేమ్‌తో వస్తే, ఇది అతిపెద్ద మార్పు కావచ్చు.

ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఆపిల్ తదుపరి తరం A19 ప్రో చిప్‌ను ఉపయోగిస్తాయని భావిస్తున్నారు, ఇది TSMC  కొత్త మూడవ తరం 3nm ప్రాసెసర్‌తో తయారవుతుంది. ఈ మోడల్ కెమెరాకు సంబంధించి కొన్ని లీక్స్ కూడా వెలువడ్డాయి, దీనిలో అప్‌గ్రేడ్ చేసిన 24MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను iPhone 17 మోడల్‌లో చూడవచ్చని, అప్‌గ్రేడ్ చేసిన 48MP టెలిఫోటో కెమెరాను iPhone 17 Proలో ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఐఫోన్ 17 సిరీస్, 2025లో లాంచ్ అవుతుందని అంచనా. ఇది డిజైన్, పర్ఫామెన్స్ రెండింటిలోనూ పెద్ద ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉంది. ఐఫోన్ 17 ఎయిర్ ప్లస్ మోడల్, అప్‌గ్రేడ్ చేసిన కెమెరా సిస్టమ్‌లు, కొత్త A19 ప్రో చిప్, చిన్న డైనమిక్ ఐలాండ్, Wi-Fi 7 వంటి ఫీచర్‌లను చూడొచ్చు. ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్న లీక్స్ నిజమైతే, ఆపిల్ కంపెనీ iPhone 17 Pro Max కోసం ఒక చిన్న డైనమిక్ ఐలాండ్‌ను తీసుకురావచ్చు. ఐఫోన్ 17 ప్రో మాక్స్ బ్రాడ్‌కామ్‌కు బదులుగా కంపెనీ రూపొందించిన వై-ఫై 7 చిప్‌ను కలిగి ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఆపిల్ తన ఐఫోన్ 17 మోడల్‌లో ఈ పెద్ద మార్పులను చేస్తుందా లేదా  అనేది చూడటం ఆసక్తికరంగా ఉంటుంది.

Exit mobile version
Skip to toolbar