Site icon Prime9

iPhone 17 Air: మన ఊహలు నిజమే గురూ.. ఐఫోన్ 17 ఎయిర్ అదిరిపోయింది.. మీరు ఓ లుక్కేయండి..!

iPhone 17 Air

iPhone 17 Air

Apple iPhone 17 Air Price and Features: టెక్ ప్రపంచంలో ఐఫోన్ 16 సిరీస్ హంగామా ముగిసిందనే చెప్పాలి. అయితే ఇప్పుడు అందరిచూపు ఐఫోన్ 17 సిరీస్‌పై పడంది. దీనిపై అంచనాలు, ఊహాగానాలు ప్రారంభమయ్యాయి.  ఈ 17 సిరీస్ గురించి ప్రతి వారం లీక్‌లు వస్తున్నాయి. టెక్ దిగ్గజం ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ అనే నాలుగు కొత్త ఐఫోన్‌లను సెప్టెంబర్ 2025లో విడుదల చేయనుంది. ఆపిల్ ప్లస్ వేరియంట్‌ను ఐఫోన్ 17 ఎయిర్‌తో భర్తీ చేస్తుందని నివేదికలు వెల్లడించాయి.

ఇప్పుడు ది వాల్ స్ట్రీట్ జర్నల్ నుండి వచ్చిన కొత్త నివేదిక ఆపిల్ సన్నని ఐఫోన్ ధరను వెల్లడించింది. ఐఫోన్ 17 ఎయిర్ ప్రో మోడల్ కంటే తక్కువ ధరను కలిగి ఉంది, దీని ధర భారతదేశంలో దాదాపు రూ. 90,000 ఉండవచ్చు. ఇది కేవలం 5 మిమీ నుండి 6 మిమీ మందంగా ఉంటుంది, అలానే ఇప్పటివరకు సన్నని ఐఫోన్‌గా నిలుస్తుందని చెబుతున్నారు. రండి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Apple iPhone 17 Air Features
ఇటీవల బ్లూమ్‌బెర్గ్  మార్క్ గుర్మాన్ ఐఫోన్ 17 ఎయిర్ ప్రస్తుత ఐఫోన్ 16 ప్రో కంటే రెండు మిల్లీమీటర్లు సన్నగా ఉండవచ్చని వెల్లడించారు. ఐఫోన్ 16 ప్రో 8.25 మిమీ మందంగా ఉంటుంది, ఐఫోన్ 17 2 మిమీ సన్నగా ఉంటే, దాని మందం 6.25 మిమీ ఉంటుంది. 6.25mm వద్ద, iPhone 17 Air ఆపిల్ అత్యంత సన్నని ఐఫోన్‌గా మారుతుంది. 6.9 మిమీ మందంతో ఉన్న ఐఫోన్ 6 అత్యంత సన్నని ఐఫోన్. ఐఫోన్ నుండి ఐఫోన్లు మందంగా మారాయి.

మ్యాక్ రూమర్స్ ప్రకారం.. ఆపిల్ iPhone 17 Airలో దాని సొంత కస్టమ్-డిజైన్ చేసిన 5G మోడెమ్ చిప్‌ను ఉపయోగిస్తుంది. ఈ చిప్ క్వాల్‌కమ్ 5G మోడెమ్ చిప్‌ల కంటే చిన్నది. ఐఫోన్ కంపెనీ ఈ చిప్‌ని ఇతర యాపిల్ కాంపోనెంట్స్‌తో మెరుగ్గా అనుసంధానించేలా డిజైన్ చేసారు. ఇది ఫోన్ లోపల స్థలాన్ని ఆదా చేస్తుంది. ఈ స్పేస్-సేవింగ్ డిజైన్ బ్యాటరీ లైఫ్, కెమెరా లేదా డిస్‌ప్లే నాణ్యతపై రాజీ పడకుండా స్లిమ్ ఐఫోన్ 17 ఎయిర్‌ను గొప్పగా చేస్తుంది.

ఐఫోన్ 17’ ఎయిర్ 6.6-అంగుళాల డిస్‌ప్లే, సింగిల్ రియర్ కెమెరాను కలిగి ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఇది 2025లో ఆపిల్ కస్టమ్ మోడెమ్ చిప్‌ను కలిగి ఉండే మూడు గ్యాడ్జెట్లలో ఒకటిగా ఉంటుందని భావిస్తున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్‌లోని ఒక నివేదిక ప్రకారం ఆపిల్ రెండు ఫోల్డబుల్ ఫోన్ల తరువాత విడుదల చేయడానికి ప్లాన్ చేస్తోంది. వీటిలో ఒకటి ఫోల్డబుల్ 19-అంగుళాల స్క్రీన్‌తో అతిపెద్ద మ్యాక్‌బుక్ కాగా, మరొకటి ఫోల్డబుల్ ఐఫోన్, ఇది లోపలికి ఓపెన్ అయే డిస్‌ప్లేతో వస్తుందని పేర్కొంది.

Exit mobile version