Site icon Prime9

Apple Vision Pro: న్యూ ప్రొడెక్ట్ ను పరిచయం చేసిన యాపిల్..

Apple Vision Pro

Apple Vision Pro

Apple Vision Pro: టెక్ దిగ్గజం యాపిల్ నుంచి మరో సరికొత్త ప్రొడక్ట్ లాంచ్ అయింది. ఎంతో కాలంగా టెక్‌ ప్రియులను చాలా కాలంగా ఎగ్జైట్ మెంట్ కు గురిచేస్తున్న అత్యాధునిక హెడ్‌సెట్‌ను యాపిల్ ఆవిష్కరించింది. రియల్, వర్చువల్‌ వరల్డ్ లో యూజర్లకు న్యూ ఫీలింగ్ ను అందించనున్న ఈ ప్రొడక్ట్ ను సోమవారం జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ పరిచయం చేశారు.

Apple enters AR/VR headset market with Vision Pro: Digital Photography  Review

విజన్ ప్రో స్పెషాలిటీ ఏంటీ?(Apple Vision Pro)

పర్సనల్‌ టెక్నాలజీలో ఈ హెడ్ సెట్ సరికొత్త హిస్టరీని సృష్టిస్తుందని టిమ్ కుక్‌ అన్నారు. ‘విజన్ ప్రో’ గా పేర్కొంటున్న హెడ్ సెడ్ ధర 3,500 డాలర్లు గా కంపెనీ నిర్ణయించింది. అంటే భారత కరెన్సీ లో రూ. 2.88 లక్షలు. వచ్చే ఏడాది నుంచి ఇవి మార్కెట్ లో అందుబాటులోకి రానున్నాయి. ఈ హెడ్ సెట్ ను గ్లాస్ఎం కార్బన్ ఫైబర్, అల్యూమినియం మిశ్రమాలతో తయారు చేశారు.

Introducing Apple Vision Pro: Apple's first spatial computer - Apple

కర్వడ్ ఫ్రేమ్, ఫ్రెంట్ గ్లాస్, థర్మల్ వెంట్స్, ఎడమవైపు పుష్ బటన్స్ లాంటివి పొందుపరిచారు. అంతే కాకుండా 12 కెమెరాలు, 6 మైక్రోఫోన్లు, డ్యూయెల్ 1.41 అంగుళాల 4 కె మైక్రో ఓఎల్ఈడీ, వివిధ రకాల సెన్సార్లు ఉన్నాయి. వీటిని ఉపయోగించి యూజర్లు కళ్లు, చేతులతోనే వివిధ రకాల యాప్‌లను ఆపరేట్ చేయొచ్చు. వీడియో కాన్ఫరెన్స్‌ల్లో ప్రతి యూజర్‌ త్రీ డైమెన్షనల్‌ వెర్షన్‌ను క్రియేట్‌ చేసేలా సరికొత్త టెక్నాలజీని విజన్ ప్రో లో పొందుపర్చారు. m2 చిప్, ఆర్1 కో ప్రాసెసర్, 16 జీబీ ర్యామ్ లాంటివి ఉన్నాయి. వైఫై, బ్లూ టూత్, సిరి, టైప్ సీ ఛార్జర్ కనెక్టడ్ ఫీచర్స్ ఇచ్చారు.

 

Exit mobile version
Skip to toolbar