iPhone SE 4 Price Leak: ఆపిల్ బ్రాండ్‌కు గ్లోబల్ మార్కెట్లో ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్రాండ్ నుంచి కొత్త గ్యాడ్జెట్ వస్తుందంటే చాలు సూపర్ బజ్ ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే ఆపిల్ త్వరలో బడ్జెట్ iPhone SE 4ని లాంచ్ చేస్తున్నట్లు లీక్స్ వస్తున్నాయి. ఈసారి పెద్ద అప్‌గ్రేడ్‌తో వస్తోంది. ఫోన్ iPhone 14 వంటి నాచ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అలానే ఫోన్ పేరు కూడా పేరు iPhone 16Eగా మారనుంది. ఈ ఫోన్‌పై ఉన్న లీక్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
iPhone SE 4 Design
ఈ నెల ప్రారంభంలో లీకైన సమాచారం ప్రకారం.. ఐఫోన్ SE 4 డిజైన్ ఫోటోలు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను గమనించినట్లయితే మొబైల్ డైనమిక్ ఐలాండ్‌తో వస్తుంది. ఫిబ్రవరి 2024లో ఓ టెక్కీ కూడా ఇదే సమాచారాన్ని వెల్లడించారు. అయితే చాలా ఇతర నివేదికలు, లీక్‌లు ఆపిల్ పాత నాచ్ డిజైన్‌తో పాత డిజైన్‌తో వస్తుందని సూచిస్తున్నాయి.
ప్రత్యేకించి SE 4 ఐఫోన్ 14 మాదిరిగానే ఉంటుంది. ఐఫోన్ SE 4 నాచ్ డిజైన్‌తో వచ్చినట్లయితే ఖచ్చితంగా తక్కువ ధరలో అంటే బడ్జెట్ ప్రైస్‌లో లాంచ్ కావచ్చు. ఐఫోన్ 14 బాడీ, భాగాలను కాపీ చేయడం ద్వారా ధర మరింత తక్కువగా ఉంటుంది. మాత్రమే కాదు, SE 4 కోసం స్క్రీన్ ప్రొటెక్టర్ నాచ్ డిజైన్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.
iPhone SE 4 Specifications
iPhone SE 4తో వస్తున్న అతిపెద్ద మార్పులలో ఒకటి TouchIDని తీసివేయడం. ఆపిల్ తన iPhone లైనప్ నుండి ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను తీసివేయాలని భావిస్తుంది. ఫేస్ ఐడీని అన్ని మోడళ్లో తీసుకొస్తుంది. స్పెసిఫికేషన్స్ విషయానికొస్తే iPhone SE 4 6.1-అంగుళాల OLED డిస్ప్లే, సింగిల్ రియర్ కెమెరా , 8GB RAM ఉంటుందని భావిస్తున్నారు. మొబైల్ A17 ప్రో చిప్, ఆపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్‌తో రావచ్చు. ఐఫోన్ 15 ప్రోలో కనిపించే చిప్సెట్ ఇదే. ఐఫోన్ 16 వంటి వెనుక కెమెరా బంప్‌ను ఫోన్లో చూడవచ్చని కొన్ని లీక్‌లు చెబుతున్నాయి.
iPhone SE 4 Price
ధర గురించి మాట్లాడితే, గ్లోబల్ స్థాయిలో, ఫోన్ ధర $500 కంటే తక్కువగా ఉంటుందని అంచనా వేయబడింది, అంటే సుమారు రూ. 43,300. ఇంతకుముందు లీక్స్‌లో దీని ధర $499 మధ్య ఉండవచ్చని చెప్పబడింది, అంటే దాదాపు రూ. 43,200 నుండి $549 అంటే దాదాపు రూ.47,500. భారతదేశంలో రూ.43,900 ధర ఉన్న iPhone SE 3 లాంచ్ ధర కంటే ఇది చాలా ఎక్కువ.