Amazon Prime: ప్రైమ్ యూజర్లకు అమెజాన్ భారీ షాక్ ఇచ్చింది. అమెజాన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ ధరలను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రైమ్ ప్రారంభ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా అమెజాన్ ధరలను అధికం చేసింది. నెలవారీ సబ్ స్క్రిప్షన్ ప్లాన్ ను ఏకంగా 67 శాతం మేర పెంచింది. మూడు నెలల ప్లాన్ లో కూడా మార్పులు చేసింది. అయితే సంవత్సరం చందా లో మాత్రం ఎలాంటి మార్పు చేయకుండా కొంత మేర ఊరట కల్పించింది. పెరిగిన ధరలు వెంటనే అమల్లోకి వచ్చాయి. అయితే ఇప్పటికే ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకున్నవారికి 2024, జనవరి 15 వ తేదీ వరకు పాత ధరలు వర్తిస్తాయి. ఒక వేళ ఈ మధ్య కాలంలో ఏదైనా కారణంతో రెన్యువల్ ఫెయిల్ అయితే మాత్రం కొత్త ధరలు అమలవుతాయి.
అమెజాన్ ధరలు ఎలా ఉన్నాయంటే..(Amazon Prime)
అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ నెలకు ఇప్పటి వరకు రూ.179 గా ఉండేది. తాజాగా అది రూ. 299 కు పెంచుతున్నట్టు అమెజాన్ తన సపోర్ట్ పేజీలో వెల్లడించింది. అదే విధంగా 3 నెలల చందా రూ. 459 ఉండగా ఇపుడు అది రూ. 599 కు పెంచింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ రూ. 1499 ఉంది. ఈ ప్లాన్ లో మాత్రం మార్పులు చేయలేదు. మరో వైపు అమెజాన్ లైట్ ఏడాది సబ్‌స్క్రిప్షన్ రూ. 999 కు లభిస్తోంది. ఇందులో కూడా ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్‌లో ఉండేవన్ని ఉంటాయి. ప్రైమ్ వీడియో కంటెంట్‌ను SD క్వాలిటీలో చూడ్డానికి మాత్రమే వీలు పడుతుంది. మధ్యలో ప్రకటనలు కూడా వస్తాయి.
అమెజన్ ప్రైమ్ సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే ఆర్డర్ వాల్యూతో ఎలాంటి సంబంధం లేకుండా ఫ్రీ డెలివరీ, ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్, ప్రైమ్ రీడింగ్ లాంటి సదుపాయాలను అమెజాన్ అందిస్తోంది. ప్రైమ్ సబ్‌స్క్రైబర్ల కోసం ప్రత్యేకంగా సేల్స్ ఉంటాయి. ఇంకోవైపు లైటనింగ్ డీల్స్ లాంటి సదుపాయాలను కల్పిస్తోంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్‌ను 2016లో భారత్‌లో ప్రవేశపెట్టింది. నెలవారీ సబ్ స్క్రిప్షన్ ను 2018లో పరిచయం చేసింది.