Site icon Prime9

Realme Narzo N65 5G: వారెవా ఏమి ఆఫర్.. రియల్‌మి 5జీ ఫోన్‌పై బిగ్ డిస్కౌంట్..!

Realme Narzo N65 5G

Realme Narzo N65 5G

Realme Narzo N65 5G: స్మార్ట్‌ఫోన్ ప్రియులకు ఓ తీపి వార్త. దీపావళికి మొబైల్స్‌పై భారీ డిస్కౌంట్లు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు ఫెస్టివల్ తర్వాత కూడా కొన్ని ఫోన్ల ధరలు తగ్గుముఖం పట్టాయి. Realme Narzo N65 5G స్మార్ట్‌ఫోన్‌ను తక్కువ ధరకు ఆర్డర్ చేయచ్చు. బ్యాంకు కార్డులు అవసరం లేకుండా కూపన్ కోడ్ ద్వారా 2,500. తగ్గింపు లభిస్తుంది. అలానే మీరు బ్యాంక్ కార్డులతో మరింత తగ్గింపు పొందవచ్చు.

కంపెనీ Realme Narzo N65 5Gని మూడు స్టోరేజ్ వేరియంట్లలో తీసుకొచ్చింది. అందులో 4GB RAM + 128GB , 6GB RAM + 128GB, 8GB RAM + 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లు ఉన్నాయి. ఈ మొబైల్ అమెజాన్‌లో తగ్గింపు ధరతో లభిస్తుంది. ఈ ఫోన్ ధర, ఆఫర్‌లు, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

ఫోన్ 4GB RAM స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,499. ప్రస్తుతం అమెజాన్‌లో కూపన్ కోడ్ డిస్కౌంట్ ద్వారా రూ.9,749కి కొనుగోలు చేయవచ్చు. 6GB RAM వేరియంట్‌పై 2,250 తగ్గింపు పొందవచ్చు. 8GB RAM వేరియంట్‌లో 2,500 డిస్కౌంట్ లభిస్తుంది. తగ్గింపు తర్వాత వరుసగా ధరలు 10,248-10,998. మీరు అమెజాన్‌లో Realme Narzo N65 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఈ ఫోన్ 6.67-అంగుళాల HD ప్లస్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్ గరిష్టంగా 625 నిట్‌ల పీక్ బ్రైట్నెస్, స్మార్ట్‌ఫోన్ MediaTek Dimension 6300 5G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆధారంగా Realme UI 5.0 OS పై పని చేస్తుంది. డైనమిక్ ర్యామ్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను 12జీబీ వరకు పెంచుకోవచ్చు. మైక్రో SD కార్డ్ ద్వారా స్టోరేజీని 2TB వరకు పెంచుకోవచ్చు.

మొబైల్‌లో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. ఇది 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం, ఇది 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. కంపెనీ 5000mAh కెపాసిటీ బ్యాటరీతో ఈ స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేసింది. దీన్ని ఛార్జ్ చేయడానికి 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. ఇది క్విక్ ఛార్జింగ్, రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది.

స్మార్ట్‌ఫోన్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP54 రేటింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో మినీ క్యాప్సూల్ 2.0, స్మార్ట్ టచ్ ఫీచర్లు ఉన్నాయి. మినీ క్యాప్సూల్ ద్వారా ముఖ్యమైన నోటిఫికేషన్‌ను చూడచ్చు. స్మార్ట్ టచ్ ఫీచర్ ద్వారా ఫోన్ తడి చేతులతో కూడా ఉపయోగించవచ్చు.

Exit mobile version