Site icon Prime9

iQOO 12 5G: బాగా చూడండి.. ఐక్యూ 12 ఫోన్‌పై మైండ్ బ్లోయింగ్ డిస్కౌంట్స్.. కెమెరాలు అదిరిపోయాయ్..!

iQOO 12 5G

iQOO 12 5G: ఐక్యూ కంపెనీ తన విభిన్న శ్రేణి స్మార్ట్‌ఫోన్‌లతో వినియోగదారులను ఆకర్షిస్తోంది. ఇటీవలే iQOO 13 ఫోన్‌ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఇప్పుడు, iQOO 12 5G ఫోన్ ధరను అకస్మాత్తుగా తగ్గించింది. అమెజాన్‌లో iQOO 12 5G స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై 23శాతం డిస్కౌంట్ ఇస్తుంది. అలానే బ్యాంక్ ఆఫర్, క్యాష్‌బ్యాక్ డిస్కౌంట్లు ఉన్నాయి. రండి.. ఈ ఫోన్ కొత్త ధర, స్పెసిఫికేషన్‌లను తెలుసుకుందాం.

iQOO 12 ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్లలో ఉంది. ఈ ఫోన్‌లో 64MP + 50MP + 50MP కెమెరాలు అందుబాటులో ఉన్నాయి. ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ప్రాసెసర్‌తో భారత్‌లో విడుదలైన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే. అలానే మొబైల్‌లో 6.78 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇందులో 512GB స్టోరేజ్, 5000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఉన్నాయి.

iQOO 12 Offers
iQOO 12 ఫోన్  12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 45,999 ధరతో ప్రారంభించింది. 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 50,999గా ఉంది ప్రస్తుతం అమెజాన్ 12GB RAM వేరియంట్ కొనుగోలుపై రూ. 4,000 డిస్కౌంట్ అందిస్తుంది. అమెజాన్ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై ఈ ఆఫర్లు లభిస్తాయి. ఈ ఫోన్‌ను డిస్కౌంట్‌తో రూ.41,999కి కొనుగోలు చేయవచ్చు.

iQOO 12 Specifications
iQOO 12 5G మొబైల్‌లో 6.78-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లే పీక్ బ్రైట్నెస్ 3000 నిట్స్, 1200Hz టచ్ శాంప్లింగ్ రేట్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసర్‌తో మార్కెట్లోకి విడుదలైంది. గ్రాఫిక్స్ కోసంAdreno 750 GPU కూడా  ఉంది. ఈ మొబైల్ Android 14 ఆధారంగా Funtouch OS 14లో పని చేస్తుంది. ఈ ఫోన్‌లో 16GB RAM+ 512GB స్టోరేజ్ అందుబాటులో ఉన్నాయి.

iQOO 12 5G ఫోన్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ మొబైల్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. 64-మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా,  50-మెగాపిక్సెల్ మూడవ కెమెరాను కూడా  ఉంది. వీడియో కాలింగ్ కోసం, ఈ ఫోన్ 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

iQOO 12 ఫోన్ 5000mAh కెపాసిటీ బ్యాటరీతో లాంచ్ అయింది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 120W ఛార్జింగ్ టెక్నాలజీ అందించారు. ఈ మొబైల్‌లో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కోసం IP64 రేటింగ్ ఉంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, NFC, USB 2.0 టైప్-సి పోర్ట్ ఉన్నాయి.

Exit mobile version
Skip to toolbar