Site icon Prime9

Discount on OnePlus 12: లిమిటెడ్ ఆఫర్.. వన్‌ప్లస్ ఫోన్‌పై రూ.6000 డిస్కౌంట్.. బోలెడు క్యాష్‌బ్యాక్స్

OnePlus 12 Limited Offer

OnePlus 12 Limited Offer

Rs 6,000 Instant Discount on OnePlus 12: మన తెలుగు రాష్ట్రాల్లో స్మార్ట్‌ఫోన్‌లకు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ మెట్రోలోనూ, విజయవాడ సిటీ బస్సులోనూ ఎవరి చేతిలో చూసిన ఫోన్లే దర్శనమిస్తాయి. పైగా ఈరోజుల్లో కిరాణా దుకాణాల నుంచి బస్సు టికెట్‌లు బుక్ చేయడం వరకు స్మార్ట్‌ఫోన్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. అలానే కొందరికి జీవనాధారంగా కూడా స్మార్ట్‌ఫోన్లు మారిపోయాయి. ఈ నేపథ్యంలో మొబైల్ తయారీ కంపెనీలు సరికొత్త గ్యాడ్జెట్లను మార్కెట్లోకి తీసుకొస్తున్నాయి. అంతేకాకుండా పాత ఫోన్ల ధరలను తగ్గిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా వన్‌ప్లస్ తన ప్రీమియం ఫోన్ ధరను భారీగా తగ్గించింది. దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

 

OnePlus 12 Offers

100W ఫాస్ట్ ఛార్జింగ్, 32MP సెల్ఫీ కెమెరాతో గత సంవత్సరం లాంచ్ అయిన వన్‌ప్లస్ ఫోన్ భారీ తగ్గింపుతో లభిస్తుంది. 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ వేరియంట్ ధర అమెజాన్ ఇండియాలో రూ.51,998. లిమిటెడ్ డీల్‌గా ఈ ఫోన్‌పై రూ. 6,000 ఫ్లాట్ డిస్కౌంట్ అందిస్తున్నారు. ఈ డిస్కౌంట్ కోసం హెచ్‌డిఎఫ్‌సి లేదా ఎస్‌బిఐ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయాలి. ఈ ఆఫర్ మే 31 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ పై కంపెనీ రూ.1559 క్యాష్‌బ్యాక్ కూడా ఇస్తోంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో ఫోన్ ధరను రూ. 45650 వరకు తగ్గించవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే డిస్కౌంట్ పాత ఫోన్ పరిస్థితి, దాని బ్రాండ్, కంపెనీ ఎక్స్ఛేంజ్ పాలసీపై ఆధారపడి ఉంటుందని గుర్తుంచుకోండి.

 

OnePlus 12 Specifications

ఈ వన్‌ప్లస్ ఫోన్‌లో 3168 x 1440 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.82-అంగుళాల క్వాడ్ HD+ కర్వ్డ్ డిస్‌ప్లే లభిస్తుంది. ఈ డిస్‌ప్లే 4500 నిట్స్ గరిష్ట బ్రైట్‌నెస్ స్థాయితో వస్తుంది. డిస్‌ప్లే ప్రొటక్షన్ కోసం గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ను అందించారు. ఈ ఫోన్‌లో 16జీబీ వరకు ర్యామ్, 512జీబీ వరకు UFS 4.0 స్టోరేజ్‌తో వస్తుంది. ప్రాసెసర్‌గా, కంపెనీ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌ను అందిస్తోంది. ఫోన్ వెనుక భాగంలో ఫోటోగ్రఫీ కోసం ఎల్ఈడీ ఫ్లాష్‌తో మూడు కెమెరాలు ఉన్నాయి.

 

వీటిలో 50-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్‌తో పాటు 48-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, 64-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉన్నాయి. కంపెనీ సెల్ఫీ కోసం ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఫోన్‌కు శక్తినివ్వడానికి 5400mAh బ్యాటరీ ఉంది. ఈ బ్యాటరీ 100W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ 100శాతం ఛార్జ్ కావడానికి 26 నిమిషాలు పడుతుంది.

 

ఈ ఫోన్ 50 వాట్ల వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం, ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. కనెక్టివిటీ కోసం, ఫోన్‌లో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6 802.11 ad 2X2 MIMO, బ్లూటూత్ 5.4, GPS, USB టైప్-C పోర్ట్ వంటి ఎంపికలు ఉన్నాయి. శక్తివంతమైన ధ్వని కోసం, ఫోన్‌లో స్టీరియో స్పీకర్లు, డాల్టీ అట్మాస్ ఉన్నాయి.

 

Exit mobile version
Skip to toolbar