OnePlus Nord CE 4 Lite 5G: ప్రస్తుతం మొబైల్ ఫోన్ ఆఫర్లలో అనేక ఉత్తమ అవకాశాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలు తమ కొత్త మోడళ్లను తక్కువ ధరలలో అందిస్తూ, వినియోగదారులకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు, ఈఎమ్ఐ ఆప్షన్లు, ఎక్స్‌చేంజ్ ఆఫర్లు అందిస్తున్నాయి. అంతేకాకుండా ప్రత్యేక ఆఫర్లు, ఫ్లాష్ సేల్స్, పండుగ సీజన్ డీల్స్ ద్వారా వినియోగదారులు మరింత తగ్గించిన ధరల్లో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయచ్చు. అందులో భాగంగా OnePlus Nord C4 Lite 5G స్మార్ట్‌ఫోన్‌పై ప్రత్యేక ఆఫర్లలో అందుబాటులో ఉంటాయి.
రూ.16,000 కంటే తక్కువ ధరకు గొప్ప డిజైన్, శక్తివంతమైన ఫీచర్లు కలిగిన ఈ ఫోన్‌ను కొనుగోలు చేయచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ అమెజాన్‌లో చాలా చౌక ధరకు అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ రూ.5,000 వరకు తగ్గింపును అందిస్తోంది, ఇందులో బ్యాంక్ డిస్కౌంట్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది, దీనిని కంపెనీ రూ.20,999 కు ప్రవేశపెట్టింది.
అయితే, ప్రస్తుతం ఈ ఫోన్ చాలా చౌక ధరకే అందుబాటులో ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 80W ఫాస్ట్ ఛార్జింగ్, పెద్ద బ్యాటరీ, గొప్ప కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ పనితీరు పరంగా కూడా చాలా శక్తివంతమైనది. ముందుగా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అందుబాటులో ఉన్న గొప్ప డీల్‌లను పరిశీలిద్దాం..!
OnePlus Nord CE 4 Lite 5G Offers
వన్‌ప్లస్ నార్డ్ CE 4 Lite 5Gని కంపెనీ రూ.20,999కి ప్రవేశపెట్టింది, కానీ ఇప్పుడు అది రూ.3,000 ఫ్లాట్ డిస్కౌంట్‌తో జాబితా చేశారు. ఈ తగ్గింపు తర్వాత, ఫోన్ ధర రూ.17,999కి చేరుకుంది. దీనితో పాటు, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 2,000 తగ్గింపు, అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్‌ను కూడా అందిస్తోంది.
బ్యాంక్ ఆఫర్ తర్వాత, ఫోన్ తుది ధర రూ.15,999గానే ఉంటుంది. ఇది మాత్రమే కాదు, డీల్‌ను మరింత మెరుగ్గా చేయడానికి, మీరు మీ పాత ఫోన్‌ను మార్చుకోవడంపై రూ. 16,850 వరకు తగ్గింపును కూడా పొందవచ్చు. అయితే, పాత ఫోన్ మొత్తం ఎక్స్‌ఛేంజ్ వాల్యూ, స్మార్ట్‌ఫోన్ మోడల్, దాని స్థితిపై ఆధారపడి ఉంటుంది.
OnePlus Nord CE 4 Lite 5G Specifications
ఫీచర్ల గురించి చెప్పాలంటే ఈ ఫోన్‌లో 120Hz వరకు రిఫ్రెష్ రేట్, 2100 నిట్స్ పీక్ బ్రైట్నెస్‌తో FHD + 6.6 అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్‌ను శక్తివంతం చేయడానికి స్నాప్‌డ్రాగన్ 695 5G ప్రాసెసర్ అందించారు. 8జీబీ వరకు ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్ OS 14పై పనిచేస్తుంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం, నార్డ్ CE4 లైట్ 5జీలో డ్యూయల్-రియర్ కెమెరా సెటప్ ఉంది, ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, డియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఈ ఫోన్ 80W ఫాస్ట్ ఛార్జింగ్, 5500mAh బ్యాటరీని అందిస్తుంది.