Site icon Prime9

Samsung Galaxy Mobile Price Drop: గెలాక్సీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఇలా చేస్తే సామ్‌సంగ్ కెమెరా ఫోన్‌పై రూ.38 వేల డిస్కౌంట్..!

Samsung galaxy S24 Plus

Samsung Galaxy Mobile Price Drop: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ సరికొత్త ఆఫర్లను తీసుకొచ్చింది. స్మార్ట్‌ఫోన్ అప్‌గ్రేడ్ చేయాలని వారికి ఇదే బెస్ట్ ఛాన్స్. ఇప్పుడు సైట్‌లో Samsung Galaxy S24 Plusని రూ. 62 వేల కంటే తక్కువ ధరకు ఆర్డర్ చేయచ్చు. అయితే కంపెనీ దీనిని రూ. 99,999 ధరకు విడుదల చేసింది. అంటే ఈ ఫోన్ పై రూ.38 వేల వరకు భారీ తగ్గింపు లభిస్తోంది. తక్కువ ధరలో ఫ్లాగ్‌షిప్-రేంజ్ ఫీచర్‌లను ఆస్వాదించాలనుకునే వారికి ఈ డీల్ చాలా బెస్ట్.

Samsung galaxy S24 Plus Offer
లాంచ్ సమయంలో ఈ ఫోన్ ధర రూ. 99,999, కానీ ఇప్పుడు మీరు ఈ ఫోన్‌ను అమెజాన్‌లో కేవలం రూ. 61,199కి కొనచ్చు. అంటే ఈ స్మార్ట్‌ఫోన్‌పై 39శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. మీరు మీ పాత ఫోన్‌ను కూడా ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే ఈ ధరను మరింత తగ్గించవచ్చు.

ఇది మాత్రమే కాదు, డివైస్‌పై క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి, ప్రైమ్ సభ్యులు Amazon Pay ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 5శాతం క్యాష్‌బ్యాక్ ఇస్తున్నారు, నాన్-ప్రైమ్ సభ్యులు 3శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇది కాకుండా, అమెజాన్‌లో ఈ ఫోన్‌పై నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. మీరు ప్రతి నెలా సులభమైన వాయిదాలలో ఈ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌ను మీ సొంతం చేసుకోవచ్చు.

Samsung galaxy S24 Plus Features
సామ్‌‌సంగ్ S24 ప్లస్ ఒక అద్భుతమైన 6.7-అంగుళాల 2K LTPO AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. డిస్‌ప్లే స్మూత్ స్క్రోలింగ్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఫోన్ సూపర్ బ్రైట్ డిస్‌ప్లేను అందిస్తుంది. డిస్‌ప్లే పీక్ బ్రైట్నెస్ 2600 నిట్స్. ఫోన్‌లో Exynos 2400 ప్రాసెసర్ ఉంది, గరిష్టంగా 12GB RAM+ 512GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది.

ఫోన్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4900mAh బ్యాటరీతో వస్తుంది, కాబట్టి మీరు దీన్ని చాలా త్వరగా ఛార్జ్ చేయచ్చు. ఇది మాత్రమే కాకుండా, ఫోన్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్, 4.5W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ కూడా ఉంది. ఫోటోగ్రఫీ ప్రియుల కోసం Galaxy S24 Plus‌లో ట్రిపుల్ కెమెరా సెటప్‌ ఉంది. ఈ కెమెరా OISతో 50MP ప్రైమరీ సెన్సార్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్,12MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. ఫోన్‌లో 12MP ఫ్రంట్ కెమెరా అందించారు.

Exit mobile version