Site icon Prime9

iQOO Mobile Offers: ఆఫర్లొచ్చాయ్ మచ్చా.. ఐక్యూ మొబైల్స్‌పై అన్‌స్టాపబుల్ డిస్కౌంట్లు..!

iQOO Mobile Offers

iQOO Mobile Offers

iQOO Mobile Offers: ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలో పండుగ సేల్స్ దాదాపుగా ముగిశాయి. డిస్కౌంట్‌తో మంచి 5G ఫోన్‌ను ఎక్కడ కొనుగోలు చేయాలో ఆందోళన చెందుతున్నారా? అయితే నిరాశ చెందకుండా నేరుగా అమెజాన్ లేదా ఐక్యూ వెబ్‌సైట్‌కి వెళ్లండి. ఎందుకంటే  iQOO Z9s Pro 5G, iQOO Z9s సిరీస్ మోడల్స్‌పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. లాచ్ ధరకంటే రూ.3000 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. ఐక్యూ భారతీయ యువతకు ఇష్టమైన బ్రాండ్లలలో ఒకటి. ఎందుకంటే ఐక్యూ బ్రాండ్ నుంచి ఏ సెగ్మెంట్ మొబైల్ తీసుకున్న మీరు పెట్టిన ధరకు కచ్చితంగా న్యాయం చేస్తాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్‌లో ఐక్యూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఐక్యూ Z9s సిరీస్‌లో రెండు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అందులో iQOO Z9s, iQOO Z9s Pro అనే రెండు వేరియంట్లు ఉన్నాయి. ఈ రెండు ఫోన్లు వచ్చిన వెంటనే అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి. iQOO Z9s ప్రో రూ. 25,000 లోపు స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్న వారికి గో-టు మోడల్‌గా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. iQOO Z9s Pro 5G మెరుగైన పనితీరు, గొప్ప కెమెరా,ఆకర్షణీయమైన డిజైన్‌తో సెగ్మెంట్‌లోని ఇతర స్మార్ట్‌ఫోన్‌ల కంటే చాలా స్మార్ట్‌గా ఉంటుంది.

iQoo Z9s Pro బేస్ వేరియంట్ 8GB + 128GB మోడల్‌కు రూ. 24,999, 8GB + 256GB మోడల్‌కు రూ. 26,999, టాప్-ఎండ్ 12GB + 256GB మోడల్‌కు రూ. 28,999. ఇవి అమెజాన్, ఐక్యూ అఫీషియల్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. కానీ బ్యాంక్ ఆఫర్‌గా బేస్ మోడల్, టాప్ మోడల్‌పై రూ.1500 తగ్గింపు వెబ్‌సైట్, అమెజాన్‌లో లభిస్తుంది. కాబట్టి బేస్ మోడల్‌ను రూ. 21999కి కొనుగోలు చేయవచ్చు. బెస్ట్ డిస్కౌంట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ కోసం వెతుకుతున్న వారికి ఇంతకంటే మంచి డిస్కౌంట్ డీల్ మరొకటి ఉండదు.

ఈ స్మార్ట్‌ఫోన్ Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్, 6.77-అంగుళాల 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్, 4500 Nits బ్రైట్‌నెస్, 2160Hzt SGWT, SGWT, సెన్సేషన్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉన్నాయి. Adreno 720 GPU, 12GB వరకు RAM + 12GB వర్చువల్ RAM, 128GB / 256GB (UFS2.2) ఇంటర్నల్ స్టోరేజ్, డ్యూయల్ బ్యాక్ కెమెరా (50MP+ 8MP), 4k వీడియో రికార్డింగ్ సపోర్ట్, ఆరా లైట్, సూపర్ నైట్ మోడ్, 16MP ఆండ్రాయిడ్, 16MP Front ఆధారంగా Funtouch OS 14లో రన్ అవుతుంది.

పవర్ విషయానికి వస్తే 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కూడిన 5500mAh బ్యాటరీ, IP64 రేటింగ్, డ్యూయల్ సిమ్ (నానో + నానో), ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, USB టైప్-C ఆడియో, స్టీరియో స్పీకర్లు, 5G ​​SA/NSA, డ్యూయల్ 4G VoLTE, USB టైప్- వంటి ఫీచర్లు ఉన్నాయి. మొబైల్‌ను లక్స్ మార్బుల్, ఫ్లాంబోయంట్ ఆరెంజ్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో ఆర్డర్ చేయచ్చు.

Exit mobile version