Site icon Prime9

Samsung Galaxy S23 FE 5G: ప్రైస్ డ్రాప్ అలర్ట్.. భారీగా తగ్గిన సామ్‌సంగ్ గెలాక్సీ మొబైల్ ధర.. ఇప్పుడే కొనండి..!

Samsung Galaxy S23 FE 5G

Samsung Galaxy S23 FE 5G

Samsung Galaxy S23 FE 5G Price Drop: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ సామ్‌సంగ్ ప్రీమియం ఫోన్‌పై గొప్ప ఆఫర్ ప్రకటించింది. బిగ్ బచాట్ సేల్‌లో భాగంగా అనేక గ్యాడ్జెట్లపై బంపర్ డిస్కౌంట్లను అందిస్తోంది. Samsung Galaxy S23 FE 5G స్మార్ట్‌ఫోన్‌పై 50 శాతం తగ్గింపుతో విక్రయిస్తోంది. అలానే రూ. 25,700 ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఇస్తుంది. వీటితో పాటు బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఫోన్ ధర, ఫీచర్లు, ఆఫర్లు తదితర వివరాలు తెెలుసుకుందాం.

Samsung Galaxy S23 FE 5G Offer
స్మార్ట్‌ఫోన్ రూ. 40,000 నుండి రూ. 45,000 వరకు భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ప్రస్తుతం, అమెజాన్ ద్వారా Samsung Galaxy S23 FE దాని 8GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్‌ ధర రూ. 32,999. అయితే దాని 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 37,000. కానీ బ్యాంక్ ఆఫర్‌తో కేవలం రూ. 31,249కి కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ Samsung Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్ క్రీమ్, పర్పుల్, గ్రాఫైట్, మింట్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో ఆర్డర్ చేయచ్చు.

అమెజాన్ HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కొనుగోలుదారులు ఫోన్‌పై అదనంగా 5 శాతం తగ్గింపును పొందచ్చు. Samsung Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌పై కంపెనీ మొత్తం రూ. 1750 బ్యాంక్ ఆఫర్‌తో దాదాపు రూ. 25,700 ఎక్స్చేంజ్ తగ్గింపును అందిస్తోంది. ఈ డీల్‌ను సులభతరం చేయడానికి మీరు నో కాస్ట్ EMI ఆఫర్‌ల కోసం కూడా చూడచ్చు.

Samsung Galaxy S23 FE 5G Specifications
ఈ స్మార్ట్‌ఫోన్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్‌తో 6.4-అంగుళాల FHD+ డైనమిక్ AMOLED 2X 120Hz డిస్‌ప్లేను కలిగి ఉంది. ఫోన్ ఆక్టా-కోర్ Samsung Exynos 2200 చిప్‌సెట్‌తో ఆధారితమైనది.  స్మార్ట్‌ఫోన్‌లో లాంచ్ సమయంలో ఆండ్రాయిడ్ 13 ఉండగా, ఫోన్ ప్రస్తుతం ఆండ్రాయిడ్ 14లో One UI 6.1 అప్‌డేట్‌తో రన్ అవుతోంది.ఇది IP68-రేటెడ్ స్మార్ట్‌ఫోన్.

ఇతర ఫీచర్ల విషయానికి వస్తే 25W వైర్డు, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 4500mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. కెమెరా గురించి మాట్లాడితే Samsung Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్‌లో 50MP OIS ప్రైమరీ, 12MP అల్ట్రా వైడ్‌తో పాటు 8MP టెలిఫోటో వెనుక ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఫోన్ ముందు భాగంలో 10MP కెమెరా కూడా ఉంది. అలానే కనెక్టివిటీలో హ్యాండ్‌సెట్ Wi-Fi 6, బ్లూటూత్ 5.3, NFC, USB 3.2 Gen 1 టైప్-C పోర్ట్‌లను అందిస్తుంది.

Exit mobile version