Site icon Prime9

OnePlus 13R: సూపర్ ఆఫర్.. వన్‌ప్లస్ 13ఆర్‌పై రూ.3000 డిస్కౌంట్.. EMI ఆఫర్లు చూస్తే..!

OnePlus 13R

OnePlus 13R: ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ OnePlus 13R స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. కంపెనీ దీనిపై రూ.3000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. వన్‌ప్లస్ ఈ ఫోన్‌లో Sony సెన్సార్ కెమెరా, 12GB RAM, 6000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లే, 80W సూపర్‌వోక్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను అందించింది. ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 49,998 ధరలో లాంచ్ అయింది. రండి ఈ ఫోన్‌పై ఉన్న ఆఫర్లు, ఫీచర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

వన్‌ప్లస్ 13ఆర్ 12జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.49,998. ఇప్పుడు మీరు అమెజాన్ సైట్‌లో ఆర్డర్ చేస్తే రూ.3000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. కాబట్టి  ఇప్పుడు మీరు రూ. 39,998 ధరతో ఆర్డర్ చేయచ్చు. ICICI క్రెడిట్ కార్డ్ ద్వారా ఆర్డర్ చేసే కస్టమర్లకు ఈ తగ్గింపు అందుబాటులో ఉంది. అలానే EMI ద్వారా ఆర్డర్ చేసినప్పుడు మీరు Onecard ఉపయోగిస్తే మీకు రూ.3000 తగ్గింపు లభిస్తుంది. ఈ డిస్కౌంట్ ఆఫర్‌లతో పాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. అంటే రూ.40,848 విలువైన ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందవచ్చు.

OnePlus 13R  Specifications
ఈ OnePlus ఫోన్ OxygenOS 15 ఆధారిత Android 15 OSతో నడుస్తుంది. ప్రీమియం పనితీరు కోసం క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఆక్టా కోర్ చిప్‌సెట్ అందుబాటులో ఉంది. దీని డిస్‌ప్లేకి 7i ప్రొటక్షన్ ఉంది. ఇది 6.78-అంగుళాల (2780 × 1264 పిక్సెల్స్) AMOLED డిస్ప్లేతో 1.5K రిజల్యూషన్, 4500 nits పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అలాగే, 2160Hz PWM డిమ్మింగ్ ఫ్రీక్వెన్సీ, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంది. కెమెరా అల్ట్రా-ప్రీమియం అవుట్‌పుట్‌ను అందిస్తుంది.

50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా +, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా + 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా సిస్టమ్ ఉన్నాయి. మెయిన్ కెమెరాలో Sony LYT 700 సెన్సార్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంది. అల్ట్రా-వైడ్ కెమెరా సోనీ IMX355 సెన్సార్‌ను కలిగి ఉంది. టెలిఫోటో కెమెరాలో సామ్‌సంగ్ ISOCELL JN5 సెన్సార్ ఉంది. 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా షూటర్ అందించారు.ఈ కెమెరాలో సోనీ IMX480 సెన్సార్ కూడా అందుబాటులో ఉంది. అదనంగా 4X లాస్‌లెస్ జూమింగ్ టెలిఫోటోలో ఉంది.

ఇది ప్రీమియం వన్‌ప్లస్ ఫోన్‌లలో 80వాట్స్ సూపర్‌వోక్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంది. లాంగ్ లైఫ్ బ్యాకప్ అందించడానికి 6000mAh బ్యాటరీని అందిస్తుంది. వన్‌ప్లస్ 13ఆర్ ఫోన్ నెబ్యులా బ్లాక్,  ఆస్ట్రల్ ట్రైల్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. అలాగే, Adreno 750 గ్రాఫిక్స్ కార్డ్, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, ఒరిజినాలిటీ ఆడియో సపోర్ట్  ఉన్నాయి. మీరు డిస్కౌంట్లలో ప్రీమియం OnePlus మోడల్‌లను కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే ఇది గొప్ప ఎంపిక.

Exit mobile version