Site icon Prime9

iPhone 13: ఇంతకన్నా చీప్‌గా దొరకడం కష్టం.. ఐఫోన్‌పై రూ.28 వేల డిస్కౌంట్..!

iPhone 13

iPhone 13

iPhone 13: ఆపిల్ ఐఫోన్లకు ప్రపంచ వ్యాప్తంగా విపరీతమై క్రేజ్ ఉంటుంది. ఫోన్‌లో ఉండే కెమెరా ఫీచర్లు, సెక్యూరిటీ అలాంటివి మరి. ఐఫోన్లు మార్కెట్‌లోకి ఎప్పుడు వచ్చినా మొబైల్ ప్రియులు ఎగబడుతుంటారు. తాజాగా ఇటువంటి సంఘటనే ముంబైలో ఐఫోన్ 16 మోడల్‌ లాంఛ్‌ సమయంలో జరిగింది. ఫోన్ సొంతం చేసుకొనేందుకు ఆపిల్ లవర్స్ అంతా గంటలపాటు క్యూ లైన్లలో పడిగాపులు కాశారు. అదే క్రేజ్ ఐఫోన్ ఓల్డ్ జనరేషన్ ఫోన్లకు ఉంది. వీటిపై ఆఫర్లు ఎప్పుడెప్పుడు వస్తాయని కళ్లకు ఒత్తులేసుకొని ఎదురుచూస్తుంటారు.

ఈ నేపథ్యంలోనే అమెజాన్ దీపావళి సేల్‌లో iPhone 12పై భారీ ఆఫర్ ప్రకటించింది. 2021లో మొబైల్ లాంచ్ అయినప్పటికీ డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఎటువంటి ఆఫర్ లేకుండా కేవలం రూ. 42,999కి డ్రీమ్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అయితే ఆఫర్‌లతో దీని ధర రూ. 41,749 అవుతుంది. ఈ డీల్ గురించి వివరంగా తెలుసుకుందాం.

ప్రస్తుతం అమెజాన్ సేల్‌లో ఐఫోన్ 13 ధర రూ. 42,999. ఫోన్‌లో ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ద్వారా కేవలం రూ. 41,749తో ఆర్డర్ చేయచ్చు. ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. అయితే ఇది మీ పాత ఫోన్ పర్ఫామెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. పాత ఫోన్‌పై రూ.5 నుంచి 10 వేల వరకు  ఆదా చేసుకోవచ్చు. ఈ ఆఫర్లతో ఫోన్ ధర భారీగా తగ్గుతుంది.

ఆపిల్ ఐఫోన్ 13ని 2021లో రూ.69,990 ప్రారంభ ధరతో విడుదల చేసింది. అంటే ఇప్పుడు రూ.28,151 తగ్గింపు లభిస్తుంది. ఈ ఐఫోన్ మోడల్ 5 కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. సూపర్ రెటినా XDR డిస్‌ప్లే కలిగి ఉంది. ఐఫోన్ 13 ప్రో ప్రోమోషన్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఇది 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌‌కు సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి ఇది బెటర్ డిస్‌ప్లే అనుభవాన్ని అందిస్తుంది.

ఐఫోన్ 13 A15 బయోనిక్ చిప్‌తో రన్ అవుతుంది. ఇది దాదాపు 15 బిలియన్ ట్రాన్సిస్టర్‌లను కలిగి ఉంది.  2 హై పర్ఫామెన్స్ కోర్లు,  4 హై కెపాసిటీ కోర్‌లు ఉన్నాయి. ఈ ఐఫోన్ లో లైటింగ్ ఫోటోగ్రఫీ కోసం పెద్ద సెన్సార్ , సెన్సార్-షిఫ్ట్ OISతో విస్తృత కెమెరాను కూడా కలిగి ఉంది. ఆపిల్ ఈ స్మార్ట్‌ఫోన్‌కి స్మార్ట్ HDR 4, మెరుగైన నైట్ మోడ్‌తో సహా అనేక మోడ్‌లను యాడ్ చేస్తుంది.

Exit mobile version