Site icon Prime9

Amazon Mobile Offer: షాకింగ్ ఆఫర్.. వన్‌ప్లస్ 12ఆర్‌పై బిగ్గెస్ట్ డిస్కౌంట్.. త్వరగా చెక్ చేయండి..!

OnePlus 12R

OnePlus 12R

Amazon Mobile Offer: తక్కువ బడ్జెట్‌లో మంచి ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త ఉంది. ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ వన్‌ప్లస్ మొబైల్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఇప్పుడు OnePlus 12Rపై గొప్ప తగ్గింపు ప్రకటించింది. అంతేకాకుండా మొబైల్స్‌పై బ్యాంక్‌ ఆఫర్స్‌తో పాటు ఎక్చేంజ్‌ డిస్కౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఫోన్. అమెజాన్ బ్లాక్ ఫ్రైడే ద్వారా దీనిని తగ్గింపు ధరతో కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్ ఫీచర్లు, ధరలు, ఆఫర్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

OnePlus 12R Offers
వన్‌ప్లస్ 12 ఆర్ రిటైల్ ధర రూ. 39,999 కానీ మీరు రూ. 35,999కి సేల్‌లో కొనుగోలు చేయచ్చు. ఇది ఈ ఫోన్ 8GB RAM, 128GB వేరియంట్,  8GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 42,999, కానీ సేల్ సమయంలో రూ. 38,999కి కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో 16GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్ అసలు ధర రూ.45,999కి బదులుగా రూ.40,999కి కొనుగోలు చేయవచ్చు.

వన్‌ప్లస్ 12 ఆర్‌పై వన్‌కార్డ్, ఫెడరల్ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా రూ. 3,000 కంటే ఎక్కువ తగ్గింపుతో అదనపు తగ్గింపును అందిస్తోంది. దీని తరువాత, ఫోన్  12GB RAM, 128GB స్టోరేజ్ వేరియంట్  ప్రభావవంతమైన ధర రూ.32,999. కాగా, 16GB RAM, 256GB వేరియంట్ ధర రూ.37,999. అంటే ఈ ఆఫర్ తర్వాత ఫోన్ ధర రూ.7 వేలు తగ్గనుంది.

OnePlus 12R Features
స్మార్ట్‌ఫోన్ 6.78 అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1-120 Hz రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. స్క్రీన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. స్క్రీన్ ప్రొటక్షన్ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అందించారు.

స్మార్ట్‌ఫోన్ ఆక్టా-కోర్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 4ఎన్ఎమ్ మొబైల్ ప్లాట్‌ఫామ్‌ను కలిగి ఉంది. గ్రాఫిక్స్ కోసం Adreno 740GPU ఉంది. మొబైల్ Android 14 ఆధారంగా ColorOS 14తో వస్తుంది. ఈ ఫోన్‌లో డ్యూయల్ సిమ్ సపోర్ట్ అందుబాటులో ఉంది.

ఫోటోగ్రఫీ గురించి మాట్లాడితే మొబైల్ 50MP Sony IMX890 సెన్సార్‌తో పాటు Aperture F/1.8ని కలిగి ఉంది, ఇది OISతో వస్తుంది. ఫోన్ 8 మెగాపిక్సెల్ 120 డిగ్రీల అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది.  2-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాతో పాటు ఎపర్చరు F/2.2 కూడా ఉంది. ఫోన్‌లో LED ఫ్లాష్ కూడా అందుబాటులో ఉంది. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం  16 మెగాపిక్సెల్ సామ్‌సంగ్ S5K3P9 సెన్సార్‌తో పాటు ఎపర్చరు F/2.4 ఉంది.

సేఫ్టీ పరంగా స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫోన్‌లో ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్ కూడా ఉంది. ఈ ఫోన్‌లో USB టైప్-సి ఆడియో, స్టీరియో స్పీకర్లు, డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది. కనెక్టివిటీ కోసం 5G, Dual 4G VoLTE, Wi-Fi 7 802.11 bee, Bluetooth 5.3, GPS, NFC, USB Type-C వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. పవర్ కోసం 5500mAh బ్యాటరీ అందించారు. ఇది 100W SuperVOOC ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Exit mobile version