Site icon Prime9

Samsung Galaxy S23 Ultra Offer: ఆఫర్ల రచ్చ.. 4 కెమెరాల ఫోన్‌పై 47 శాతం డిస్కౌంట్.. సింపుల్ EMIలో కూడా దక్కించుకోవచ్చు..!

Samsung Galaxy S23 Ultra

Samsung Galaxy S23 Ultra

Samsung Galaxy S23 Ultra Offer: ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 23 అల్ట్రాను చౌకగా కొనుగోలు చేయడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తున్నాయి. రెండు ప్లాట్‌ఫామ్‌లలో ఈ 200 మెగాపిక్సెల్ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్ ఇస్తున్నాయి. మీరు ప్రీమియం విభాగంలో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే Samsung Galaxy S23 Ultra ఉత్తమ ఎంపిక.

సామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రాలో Samsung హై స్పీడ్ Snapdragon 8 Gen 2 ప్రాసెసర్‌ని ఇచ్చింది. దీనితో పాటు, వెనుక ప్యానెల్‌లో మీకు 4 కెమెరా సెన్సార్లు ఉన్నాయి. ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీకి ఇది గొప్ప స్మార్ట్‌ఫోన్. ఇది లక్ష కంటే ఎక్కువ ధరతో వచ్చినప్పటికీ, ఇప్పుడు సామ్‌సంగ్, ఇ-కామర్స్ వెబ్‌సైట్ దాని ధరను భారీగా తగ్గించింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ అందించే ఆఫర్‌ల గురించి  వివరంగా తెలుసుకుందాం.

Samsung Galaxy S23 Ultra Flipkart Offer
సామ్‌సంగ్ గెలాక్సీ S23 అల్ట్రా 256 జీబీ కొనుగోలు చేయడానికి ఇది ఉత్తమ అవకాశం. ఈ వేరియంట్ ధర రూ. 1,49,999 అయినప్పటికీ, ఫ్లిప్‌కార్ట్ దానిపై 47 శాతం తగ్గింపు ఆఫర్‌ ఇస్తుంది. ఫ్లాట్ తగ్గింపుతో మీరు దీన్ని కేవలం రూ.78,999కి కొనుగోలు చేయచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్‌లలో అదనపు తగ్గింపు కూడా పొందచ్చు. ఇది కాకుండా మీరు నెలవారీ EMI రూ. 2,792 వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు.

Samsung Galaxy S23 Ultra Amazon Offer
అమెజాన్ తన కస్టమర్లకు దీనిపై పూర్తి 50 శాతం తగ్గింపును అందిస్తోంది. అంటే రూ. 1.5 లక్షల ధర కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ను మీరు అమెజాన్ నుండి సగం ధరకే కొనుగోలు చేయచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ధర ప్రస్తుతం అమెజాన్‌లో రూ. 74,990. ఈ ఫోన్ కొనుగోలుపై అమెజాన్ తన కస్టమర్లకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఇస్తోంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను రూ. 27,550 విలువతో మార్చుకోవచ్చు.

Samsung Galaxy S23 Ultra Features
ఈ స్మార్ట్‌ఫోన్‌లో అల్యూమినియం ఫ్రేమ్‌తో గ్లాస్ బ్యాక్ ప్యానెల్ పొందుతారు. ఇందులో మీకు IP68 రేటింగ్ ప్రొటక్షన్ కూడా అందించారు. డిస్‌ప్లే సైజు గురించి చెప్పాలంటే ఇది 6.8 అంగుళాల AMOLED ప్యానెల్‌ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లేలో 1750 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. డిస్‌ప్లేను రక్షించడానికి, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ఇందులో అందించారు. ఇది Android 13 ఆధారంగా  One UI 6.1.1పై రన్ అవుతుంది.

సామ్‌సంగ్ ఈ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్‌ ఉంది. ఇది 4nm టెక్నాలజీ ఆధారిత ప్రాసెసర్. ఇందులో12GB RAM + 1TB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం ఇందులో నాలుగు కెమెరాలు ఉన్నాయి.  200+10+10+12 మెగాపిక్సెల్ సెన్సార్. సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఇది 12 మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. స్మార్ట్‌ఫోన్‌ను పవర్ చేయడానికి 45W ఫాస్ట్ ఛార్జింగ్‌  సపోర్ట్ ఇచ్చే 5000mAh బ్యాటరీ ఇన్‌స్టాల్ చేశారు.

Exit mobile version