Amazon Echo Pop: అమెజాన్ నుంచి మరో స్మార్ట్ స్పీకర్ భారత మార్కెట్ లో రిలీజ్ అయింది. అమెజాన్ నుంచి ఇంతకు ముందు వచ్చిన ఎక్ డాట్ లాగానే తాజాగా ‘ఎకో పాప్’ పేరుతో ఈ స్పీకర్ లాంచ్ అయింది. ఈ సరికొత్త స్పీకర్ లో స్మార్ట్ హోమ్ డివైజెస్, మ్యూజిక్ ప్లే బ్యాక్, సెట్టింగ్స్ రిమైండర్స్ ను సపోర్టు చేసే విధంగా అలెక్సా వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ను ఇందులో అమర్చారు. వాయిస్ కమాండ్స్ కు వేగంగా సపోర్ట్ చేసే AZ2 న్యూరెల్ ఎడ్జ్ ప్రాసెసర్ ను ఎకో పాప్ లో ఇస్తున్నారు. స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్ కు కనెక్ట్ చేసేకునే వీలుగా బ్లూ టూత్ కూడా ఎక్ పాప్ లో ఉంది.
భారత్ లో అమెజాన్ ఎకో పాప్ ధర రూ. 4,999 గా నిర్ణయించారు. నాలుగు రంగుల్లో ( బ్లాక్, గ్రీన్, పర్పుల్, వైట్ ) ఇది లభ్యమవుతోంది. అమెజాన్ ఈ కామర్స్ సైట్ లో ఈ స్మార్ట్ స్పీకర్ ను కొనుగోలు చేయవచ్చు. అదే విధంగా క్రోమా, రిలయన్స్ డిజిటల్ లాంటి రిటైల్ స్టోర్స్ లో కూడా ఇది అందుబాటులో ఉంచారు.
ఎక్ పాప్ లో 1.95 ఇంచుల ఫ్రంట్ ఫైరింగ్ డైరెక్షనల్ స్పీకర్ ఇచ్చారు. స్పీకర్ యాక్టివ్ లో ఉందనూ విషయం తెలుసుకునేలా ఎల్‌ఈడీ లైట్ కూడా ఉంది. అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, హంగామా, స్పోటిఫై, జియో సావన్, యాపిల్ మ్యూజిక్‌ను ఎక్ పాప్ సపోర్ట్ చేస్తుంది. ఎకో డాట్ (5th Gen)లో ఉన్న AZ2 Neural Edge ప్రాసెసర్ ను ఇందులో కూడా ఇస్తున్నారు.
వాల్యూమ్ కంట్రోల్ బటన్స్ తో పాటు అలెక్సా మైక్రోఫోన్‌ను ఆఫ్ చేయడానికి స్పెషల్ బటన్ ఇచ్చారు. ఎకో డాట్ స్పీకర్లు రౌండ్ గా ఉంటే.. ఎకో పాప్ మాత్రం హాఫ్ రౌండ్ గా ఉంటుంది. ఎకో పాప్ బరువు 196 గ్రాములు. డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూ టూత్ లాంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఎకో పాప్ లో ఉన్నాయి. రిమోట్ డివైజ్‌ల నుంచి కూడా ఆడియో స్ట్రీమింగ్ సపోర్ట్ చేస్తుంది.