Site icon Prime9

OnePlus Nord 4 5G: అమెజాన్ అదిరే ఆఫర్.. వన్‌ప్లస్ 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. త్వరగా లూట్ చెయ్..!

OnePlus Nord 4 5G

OnePlus Nord 4 5G

OnePlus Nord 4 5G: ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన వినియోగదారులకు శుభవార్త అందించింది. కంపెనీ ప్రీమియం మొబైల్ ‘OnePlus Nord 4 5G’పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ నుండి 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్‌ను తక్కువ ధరకే కొనుగోలు చేయచ్చు. అలానే అదనంగా బ్యాంక్ ఆఫర్లు, డిస్కౌంట్లు కూడా ఇస్తున్నారు. మీరు కూడా ఈ ఫోన్ కొనుగోలు చేయాలని చూస్తుంటే రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్ ‘OnePlus Nord 4 5G’పై భారీ ఆఫర్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌ను 28,998కి కొనుగోలు చేయచ్చు. ఈ ఫోన్‌పై రూ. 4,000 ఫ్లాట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. అలానే మీరు ఫోన్ కొనుగోలుపై రూ. 870 వరకు క్యాష్‌బ్యాక్ కూడా పొందచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు ఈ ఫోన్ ధరను రూ. 22,800 వరకు తగ్గించచ్చు.

ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో లభించే అదనపు తగ్గింపు మీ పాత ఫోన్, బ్రాండ్, కంపెనీ ఎక్స్‌ఛేంజ్ పాలసీ స్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ కేవలం 28 నిమిషాల్లో 0 నుండి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇందులో మంచి కెమెరా సెటప్, శక్తివంతమైన ప్రాసెసర్ కూడా ఉన్నాయి.

OnePlus Nord 4 5G Features And Specifications
ఫోన్ 2772×1240 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.74 అంగుళాల AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీని పీక్ బ్రైట్నెస్ 2150 నిట్‌ల వరకు ఉంటుంది. ఫోన్ గరిష్టంగా 12 GB+256 GB వరకు UFS 4.0 స్టోరేజ్‌తో ఉంటుంది. ప్రాసెసర్‌గా, మీరు ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7+ Gen 3 చిప్‌సెట్‌ని చూడచ్చు. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో LED ఫ్లాష్‌తో 50-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది.

అదే సమయంలో కంపెనీ సెల్ఫీల కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అందిస్తోంది. ఫోన్‌లో అందించిన బ్యాటరీ 5500mAh, ఇది 100 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఛార్జింగ్ టెక్నాలజీతో కేవలం 28 నిమిషాల్లోనే ఫోన్ బ్యాటరీ 0 నుంచి 100 శాతం వరకు ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. OS విషయానికి వస్తే, ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్ OS 14 పై పనిచేస్తుంది.

Exit mobile version
Skip to toolbar