Site icon Prime9

Jio 5G: రాజస్థాన్‌లో జియో 5G సేవలను ప్రారంభించిన ఆకాష్ అంబానీ

Jio 5G

Jio 5G

Jio 5G: రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ శనివారంరాజస్థాన్‌లోని నాథ్‌ద్వారా పట్టణంలోప్రసిద్ధ శ్రీనాథ్‌జీ ఆలయం నుండి 5G సేవలను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
5జీ సేవలు అందరికీ అందుబాటులో ఉంటాయి. నేటి నుంచి నాథ్‌ద్వారాతో పాటు చెన్నైలో కూడా 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి అని ఆకాష్ అంబానీ తెలిపారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గత నెలలో ఆలయాన్ని సందర్శించారు. ఈ ఆలయం నుండి 5Gరాష్ట్రంలో సేవలను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. 2015లో కూడా ముఖేష్ అంబానీ 4G సేవలను ప్రారంభించే ముందు శ్రీనాథ్‌జీ ఆలయాన్ని సందర్శించారు.

అక్టోబర్ 1న, ప్రధాని నరేంద్ర మోదీ 5G సేవలను ప్రారంభించారు. 5G సేవలు రాబోయే రెండేళ్లలో దేశ వ్యాప్తంగా అందుబాటులోకి వస్తాయి.
జియో డిసెంబర్ 2023 నాటికి మరియు భారతీ ఎయిర్‌టెల్ మార్చి 2024 నాటికి అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చాయి.ఆగస్టులో రూ. 1.56 లక్షల కోట్ల (19 బిలియన్ డాలర్లు) 5G స్పెక్ట్రమ్ వేలంలో రిలయన్స్ రూ. 90,000 కోట్ల విలువైన ఎయిర్‌వేవ్‌లను కొనుగోలు చేసింది.ఎంపిక చేసిన నగరాల్లో 5G సేవలను ప్రారంభించింది.

బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయడానికి ఇది గూగుల్ తో కలిసి పనిచేస్తోంది. 42 కోట్లకు పైగా కస్టమర్లను కలిగి ఉన్న రిలయన్స్ జియోకు నోకియా 5G రేడియో యాక్సెస్ నెట్‌వర్క్ పరికరాలను సరఫరా చేస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.

Exit mobile version