iPhones: టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ 16 సరీస్ ఫోన్లను విడుదల చేసినప్పటి నుంచి తన పాత ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ మెడళ్లలో కొన్నింటిని నిలిపివేయాలని నిర్ణయించుకుంది. కంపెనీ వాటిని తన వెబైసైట్ నుంచి కూడా తొలగించింది. ఆపిల్ కొత్త మోడల్స్ వచ్చిన ప్రతిసారి పాత వాటిని ఆపేస్తుంది. కాబట్టి ఇప్పుడు అందులో ఏయో మోడల్స్ ఉంటాయి? తదితర వివరాలు తెలుసుకుందాం.
ఐఫోన్ 16 సిరీస్ వచ్చిన తర్వాత ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13లను కంపెనీ నిలిపివేసింది. ఇప్పుడు ఆపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 15, ఐఫోన్e 15 ప్లస్, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్రో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వీటిని మీరు ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయచ్చు. ఆపిల్ చాలా కాలంగా ఈ ట్రెండ్‌ని అనుసరిస్తోంది. ఐఫోన్ 15 లాంచ్ సమయంలో కూడా ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మాక్స్ నిలిచిపోయాయి. ఇప్పుడు ఐఫోన్ 16 సిరీస్ లాంచ్‌తో మళ్లీ అదే నిర్ణయం తీసుకున్నారు.
కంపెనీ వెబ్‌సైట్ నుంచి తీసేసిన ఐఫోన్లు ఇప్పటికీ సర్వీస్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను పొందుతూనే ఉంటాయి. అంటే కావాలంటే వాటిని కొనుక్కోవచ్చు. అదే సమయంలో మీరు ఈ ఫోన్‌లను ఉపయోగిస్తున్నట్లయితే దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మీరు ఈ ఫోన్‌లలో తాజా OS అప్‌డేట్‌లను సంవత్సరాల తరబడి పొందుతూనే ఉంటారు. దీని కారణంగా వాటి పనితీరు అద్భుతంగా ఉంటుంది. అయితే ఐఫోన్ 13 కొన్ని సందర్భాల్లో ఈ అప్‌డేట్లను పొందదు. ఎందుకంటే ఇది చాలా పాత మోడల్.
ఆపిల్ వెబ్‌సైట్ నుండి తీసేసిన పాత మోడల్‌లు ఇప్పటికీ ఆఫ్‌లైన్ మార్కెట్‌లు, షాపింగ్ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉన్నాయి. మీరు ఈ ఫోన్‌లను ఆన్‌లైన్‌లో కంటే చాలా చౌకగా ఆఫ్‌లైన్‌లో పొందచ్చు. మీరు ఆఫ్‌లైన్ మార్కెట్‌లో సీల్డ్ ప్యాక్ iPhone 13ని కేవలం రూ. 30 వేలకే పొందవచ్చు. అయితే ఐఫోన్ 15 ప్రో,ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర ప్రస్తుతం రూ. 85 వేల నుండి రూ. 95 వేల మధ్య నడుస్తోంది.
బయట అనేక ఆఫ్‌లైన్ స్టోర్‌లు ఉన్నాయి. ఇవి మీకు ఈ ధరలో సీల్డ్ ప్యాక్ ఐఫోన్‌ను అందిస్తాయి. ఇది కాకుండా మీరు ఎక్కువ డబ్బు ఆదా చేయాలనుకుంటే మీరు ఓపెన్ బాక్స్ ఐఫోన్‌ను కూడా కొనుగోలు చేయవచ్చు, దీని ధర సీల్డ్ ప్యాక్ మోడల్ కంటే రూ. 10,000 వరకు తక్కువగా ఉంటుంది. అయితే స్టోర్ మీకు ఇందులో బ్రాండ్ వారంటీని ఇస్తుంది.