Site icon Prime9

Data Dump Technology Saif Ali Khan Case: డేటా డంప్ టెక్నాలజీ.. మీ మొబైల్ హిస్టరీ భద్రంగా ఉంటుంది..సైఫ్ అలీ ఖాన్‌ దాడి కేసులో ఇదే కీలకం..!

Data Dump Technology Saif Ali Khan Case

Data Dump Technology Saif Ali Khan Attack Investigation: బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్‌పై ఓ దొంగ కత్తితో దాడి చేశాడు. ఆయన నివాసంలోని సీసీటీవీ ఫుటేజీ ద్వారా దాడి చేసిన వ్యక్తిని గుర్తించారు. దీని తర్వాత, దొంగ గురించిన మొత్తం సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు డేటా డంప్ టెక్నాలజీని ఉపయోగించారు. దాని సహాయంతో వ్యక్తులకు సంబంధించిన డిజిటల్ డేటాను కలెక్ట్ చేయచ్చు. రండి దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

What Is A Data Dump?
డేటా డంప్‌ను మొబైల్ ఫోన్ డంప్ లేదా సెల్‌ఫోన్ డంప్ అని కూడా అంటారు. ఇది ఒక వ్యక్తి డిజిటల్ డేటాను సేకరించడం, పరిశీలించడంలో సహాయపడే టెక్నాలజీ. ఇందులో కాల్ లాగ్‌లు, టెక్స్ట్ మెసేజెస్, ఇమెయిల్‌లు, ఫోటోలు, వీడియోలు, అప్లికేషన్ డేటా, ఇతర సమాచారంతో పాటు బ్రౌజింగ్ హిస్టరీ ఉంటాయి. సాధారణంగా, ఈ టెక్నిక్‌ను నేరస్థులను గుర్తించడానికి, దర్యాప్తు ప్రక్రియను వేగవంతం చేయడానికి పోలీసులు లేదా దర్యాప్తు సంస్థలు ఉపయోగిస్తాయి.

How Does The Technology Work?
డేటా డంప్ టెక్నిక్ ప్రధాన లక్ష్యం అనుమానాస్పద వ్యక్తి డిజిటల్ డేటాను సేకరించడం, అతని కార్యకలాపాలను విశ్లేషించడం. ఒక సంఘటన లేదా నేరం తర్వాత, దర్యాప్తు సంస్థలు నేరస్థుడి గుర్తింపు లేదా అతని స్థానం గురించి సమాచారాన్ని సేకరించవలసి వచ్చినప్పుడు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియలో స్మార్ట్‌ఫోన్ లేదా ఇతర పరికరానికి సంబంధించిన డేటాను తీసుకుంటారు.

డేటా డంప్ ప్రక్రియలో, అనుమానిత వ్యక్తి ఏ నెట్‌వర్క్ ఏరియాలో ఉన్నారనేది ముందుగా కనిపిస్తుంది. ఇందుకోసం లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్, సెల్ టవర్ల సాయం తీసుకుంటారు. సెల్ టవర్లు స్మార్ట్‌ఫోన్ ఉపయోగించే మొత్తం డేటాను స్టోరేజ్ చేస్తాయి, టెలికాం కంపెనీలు దానిని తొలగించిన తర్వాత కూడా భద్రంగా ఉంచుతాయి.

Connection To Cell Towers And Data Dumps
మనం ఎప్పుడు కాల్ చేసినా, మెసేజ్ పంపినా, స్మార్ట్ ఫోన్ నుంచి ఇంటర్నెట్ బ్రౌజ్ చేసినా ఈ డేటా సంబంధిత సెల్ టవర్ల ద్వారా బదిలీ అవుతుంది. ఈ డేటా రికార్డుల రూపంలో టెలికాం కంపెనీల వద్ద స్టోరే అవుతుంది. డేటా డంప్ ప్రక్రియలో, పోలీసులు ఈ డేటాను పొందుతారు. అనుమానితుడి కార్యకలాపాలు, స్థానాన్ని ట్రేస్ చేస్తారు.

Digital Evidence Management System (DEMS)
ఇందులో, డేటా డంప్ ప్రక్రియలో DEMS (డిజిటల్ ఎవిడెన్స్ మేనేజ్‌మెంట్ సిస్టమ్) ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ వ్యవస్థ డిజిటల్ సాక్ష్యాలను మేనేజ్ చేయడానకి పని చేస్తుంది. అయితే, ఈ డేటా చట్టపరమైన ప్రక్రియ లేకుండా ఎవరికీ అందుబాటులో ఉండదు. డేటాను యాక్సెస్ చేయడానికి దర్యాప్తు ఏజెన్సీలు చట్టపరమైన అనుమతిని పొందవలసి ఉంటుంది.

Saif Ali Khan Assault Case
జనవరి 16వ తేదీ రాత్రి ముంబైలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఘోరమైన దాడి జరిగింది. ఆయన బాంద్రా ఇంటి వద్ద ఒక దుండగుడు అతనిపై కత్తితో దాడి చేశాడు, నటుడికి తీవ్ర గాయాలయ్యాయి. సైఫ్ మెడ, చేతులు, పుపై లోతైన గాయాలయ్యాయి, అతని వెన్నుపాములో కత్తి ముక్క కూడా ఇరుక్కుపోయింది. శస్త్రచికిత్స సమయంలో, వైద్యులు 2.5 అంగుళాల కత్తిని తొలగించారు. ప్రస్తుతం, సైఫ్ అలీ ఖాన్ పరిస్థితి మెరుగుపడుతోంది, అతన్ని ఐసియుకు తరలించారు.

ఈ కేసును విచారించేందుకు పోలీసులు మొబైల్ డేటా డంప్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నిక్ ద్వారా, అనుమానితుడి స్థానం, కార్యకలాపాల గురించి సమాచారం సేకరించారు.

Exit mobile version