Chahal Paying Rs 60 Crore Alimony to Dhanashree: టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహలు వ్యక్తిగత విషయానికి సంబంధించిన రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. చాహల్ అతడి భార్య ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారని, పరస్పర అంగీకారంతో విడిపోవడానికి సిద్ధమైనట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వీరిద్దరు దూరంగా ఉంటున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ వార్తలపై ఇంతవరకు యుజ్వేంద్ర కానీ, ధనశ్రీ కానీ స్పందించలేదు.
కానీ వీరు తీరు చూస్తుంటే మాత్రం విడాకుల వార్తలు నిజమే అన్నట్టు ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అలాగే పెళ్లికి సంబంధించిన ఫోటోలు, పోస్ట్‌లను డిలీట్ చేశారు. వీరిద్దరికి సంబంధించిన పోస్ట్స్‌ని తమ సోషల్ మీడియాలో ఖాతాల నుంచి తొలగించారు. దీంతో వీరి విడాకులు వార్తలు గుప్పమన్నాయి. ఎక్కడ చూసిన వీరిద్దరు సింగిల్‌గానే కనిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ధనశ్రీ, యుజ్వేంద్ర చాహాల్ విడాకులు ఖాయమే అన్నట్టు ఉంది. ఇప్పుడు వీరి డైవోర్స్‌కి సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ధనశ్రీ నుంచి విడాకులు తీసుకునేందుకు యుజ్వేంద్ర చాహల్ భరణం కింద భారీ మొత్తం చెల్లిస్తున్నాడంటూ వార్తలు గుప్పుమన్నాయి. వీరి విడాకుల విషయమై ఇప్పటికే చర్చలు జరిగాయని, ఫ్యామిలీ కోర్టులో కూడా విడాకులకు దరఖాస్తు చేసుకున్నట్టు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. దీనిపై ఇరు కుటుంబ సభ్యులు మధ్య చర్చలు జరిగాయని, దీని ప్రకారం యుజ్వేంద్ర చాహల్ ధనశ్రీ వర్మకు రూ.60 కోట్లు పైగా భరణం చెల్లించేందుకు చాహల్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఈ వార్తలపై క్లారిటీ రావాలంటే ఈ స్టార్ కపుల్ స్పందించేవరకు ఆగాల్సిందే.
విడాకుల వార్తల నేపథ్యంలో ఇటీవల ధనశ్రీ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్ ఓ పోస్ట్ షేర్ చేసింది. నిజానికి ఎలాంటి అధారాలు అవసరం లేదనే ఉద్దేశంతో ఈ పోస్ట్ షేర్ చేసింది. “ప్రస్తుతం నేను, నా కుటుంబం గడ్డు పరిస్థితులను చూస్తున్నాం. నిరాధారమైన వార్తలు, ఫేక్ పోస్టులతో నా గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు. ఈ పేరు, కీర్తిని సంపాదించుకోవడానికి నేను చాలా సంవత్సరాలు కష్టపడ్డాను. నా మౌనం నా బలహీనత కాదు. అదే నా బలం. సోషల్ మీడియాలో నెగిటివిటీ చాలా తొందరగా వ్యాపిస్తుంది. నిజానికి కట్టుబడాలని ఉండాలనుకుంటున్నాను. విలువలతో ముందుకు సాగాలని అనుకుంటున్నాను. ఎటువంటి ఆధారాలు లేకపోయినా, నిజానికి విలువెక్కువ. ఓం నమః శివాయ” అంటూ రాసుకొచ్చింది.