Site icon Prime9

Babar Azam: కోహ్లీని దాటేసిన బాబర్.. చేరువలో మరో రికార్డు!

Virat Kohli that can be broken by Babar Azam: క్రికెట్‌లో కింగ్ కోహ్లీ రికార్డుల గురించి చెప్పాల్సిన పనే లేదు. అయితే, కోహ్లీ రికార్డులలో ఒకదానిని తాజాగా పాక్ క్రికెటర్ బాబర్ బ్రేక్ చేశాడు. హోబర్ట్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో బాబర్ 28 బంతుల్లో 4 ఫోర్లతో 41 రన్స్ చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

కోహ్లీ అంతర్జాతీయ టీ20ల్లో 4188 పరుగులు చేయగా.. బాబర్ ప్రస్తుతం 4192 పరుగులతో దానిని బీట్ చేశాడు. ఒకవేళ బాబర్ మరో 40 పరుగులు చేస్తే, ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డు (4231 పరుగులు)ను అధిగమించి టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవనున్నాడు. కాగా, కోహ్లీ, రోహిత్ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో త్వరలో ఈ రికార్డ్ బాబర్ ఖాతాలోకి వెళ్లటం ఖాయమైంది.

Exit mobile version