Site icon Prime9

Travis Head: మరోసారి తండ్రయిన స్టార్ క్రికెటర్.. ఫోటోలు వైరల్

Travis Head Welcomes A Baby Boy With Wife Jess: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, ఐపీఎల్ సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్ ట్రావిస్ హెడ్ మరోసారి తండ్రి అయ్యాడు. ట్రావెస్ సతీమణి జెస్సికా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ బాబుకు హారిసన్ జార్జ్ అని నామకరణం చేశారు. అనంతరం కూతురు, కుమారుడు, భార్యతో కలిసి దిగిన ఫోటోలను ట్రావిస్ హెడ్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ట్రావిస్ హెడ్ అభిమానులు విషెస్ చెబుతున్నారు. ఇదిలా ఉండగా, 2021లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న ట్రావిస్ హెడ్, జెస్సికా.. 2022 సెప్టెంబర్‌లో ఆడబిడ్డకు జన్మనిచ్చారు. అనంతరం వీరిద్దరూ 2023లో వివాహం చేసుకున్నారు.

అయితే, మ్యారేజ్‌కు ముందు వీరిద్దరూ హాలిడే ట్రిప్ కోసమని మాల్దీవులకు వెళ్లారు. ఆ సమయంలో వీరి ఎక్కిన విమానం ప్రమాదం నుంచి బయటపడింది. టేకాఫ్ అయిన తర్వాత ఓ ద్వీపంలో అత్యవసర ల్యాండ్ కావడం భయాందోళనకు గురైనట్లు ఓ ఇంటర్వ్యూలో జెస్సికా తెలిపింది. కాగా, గత ఐపీఎల్ సీజన్‌లో ట్రావిస్ హెడ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున అదరగొట్టాడు. అయితే మరోసారి ఆయనను సన్‌రైజర్స్ హైదరాబాద్ రిటైన్ చేసుకుంది.

Exit mobile version