Site icon Prime9

IPL 2025 34th Match: చిన్నస్వామి స్టేడియంలో పెరిగిన వర్షం.. మ్యాచ్ జరుగుతుందా?

Royal Challengers Bengaluru vs Punjab Kings

Royal Challengers Bengaluru vs Punjab Kings

Royal Challengers Bengaluru vs Punjab Kings Match Toss delayed due to Rain Effect: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ బెంగళూరు వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. అయితే బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో వర్షం కొనసాగుతోంది. దీంతో 7 గంటలకు పడాల్సిన టాస్ వాయిదా పడింది. ప్రస్తుతం వర్షం అలాగే పడడంతో మ్యాచ్ జరుగుతుందా? లేదా? అనే ప్రశ్న ఫ్యాన్స్‌లో మొదలైంది.

 

వర్షం కారణంగా ఇప్పటివరకు టాస్ పడలేదు. దీంతో పూర్తిగా 40 ఓవర్ల ఆట సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవేళ వర్షం ఆగితే.. మైదానం సిద్ధమయ్యాక తగ్గింపు ఓవర్లతో మ్యాచ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుం వర్షం పడుతూనే ఉండడంతో టాస్ వేసేందుకు మరికొంత సమయం పట్టేలా ఉంది. కాగా, వర్షం కారణంగా టాస్ ఆలస్యం కావడం అనేది ఈ ఐపీఎల్ సీజన్‌లో ఇదే తొలిసారి.

 

అయితే, చిన్న స్వామి స్టేడియంలో చినుకులుగా వర్షం కురుస్తోంది. ఇది పెద్ద వర్షంలా మారనుంది. కానీ ఇక్కడ చాలా తొందరగా మైదానాన్ని ఆటకు సిద్దం చేసే డ్రెయినేజీ వ్యవస్థ ఉండడంతో వర్షం ఆగితే మ్యాచ్ కొనసాగించవచ్చు. ఒకవేళ వర్షం తగ్గితే రాత్రి 10.54 నిమిషాల వరకు మ్యాచ్ ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి. కనీసం 5 ఓవర్ల మ్యాచ్ ఆడేందుకు సాధ్యం ఉంటుందని అంపైర్లు చెబుతున్నారు. ఇక, అప్పటికీ వర్షం తగ్గకపోతే మ్యాచ్‌ను రద్దు చేసి చెరో పాయింట్ ఇచ్చే అవకాశం ఉంది.

Exit mobile version
Skip to toolbar