Site icon Prime9

India vs England: భారత్- ఇంగ్లాండ్ మధ్య రెండో టి20

మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ లో భాగంగా ఇవాళ భారత్- ఇంగ్లాండ్ మధ్య రెండో టి20 జరగనుంది. సాయంత్రం 7గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టి20 గెలుపు ఉత్సహాంతో ఉన్న టీమిండియా సిరీస్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగబోతుంది. మరోవైపు సొంత గడ్డ పై భారత్ చేతిలో ఎదురైన ఓటమి నుంచి తేరుకుని రెండో టి20లో గెలిచి సిరీస్ లో నిలవాలని జాస్ బట్లర్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది.

ఇంగ్లాండ్ తో ఐదో టెస్టు మ్యాచ్ ముగిసిన ఒక్క రోజు తర్వాతే తొలి టి20 జరగడంతో.. టెస్టు మ్యాచ్ లో ఆడిన ప్లేయర్లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. ఫలితంగా దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, అర్ష్ దీప్ సింగ్, అక్షర్ పటేల్ లాంటి యువ ప్లేయర్లకు తొలి టి20లో ఆడే అవకాశం వచ్చింది. అయితే రెండో టి20కి సీనియర్లు కోహ్లీ, పంత్, జస్ ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు తిరిగి రావడంతో జట్టు కూర్పు ఎలా ఉంటుందనేది అందరిలోనూ ఆసక్తిని కలిగిస్తోంది. అర్ష్ దీప్ సింగ్, దీపక్ హుడా, దినేశ్ కార్తీక్, అక్షర్ పటేల్ లపై వేటు వేసే అవకాశాలు కన్పిస్తున్నాయి

మరోవైపు హార్దిక్ పాండ్యా సూపర్ ఫామ్ లో ఉండటం భారత్ కు సానుకూలాంశం. తొలి టి20లో 51 పరుగులు చేయడంతో పాటు 4 వికెట్లు తీసి జట్టుకు ఒంటి చేత్తో విజయాన్ని అందించాడు. ఇంగ్లండ్ తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్ లో అదరగొట్టిన రిషభ్ పంత్.. టి20ల్లో కూడా అదే రీతిలో ఆడతాడో లేదో చూడాలి. ఒకరకంగా చెప్పాలంటే అందరి కళ్లు కూడా అతడిపైనే ఉన్నాయి. పంత్ పొట్టి ఫార్మాట్ లో రాణిస్తేనే టి20 ప్రపంచకప్ లో అతడికి తుది జట్టులో స్థానం దక్కే అవకాశం ఉంది.

Exit mobile version
Skip to toolbar