Site icon Prime9

Champions Trophy 2025: మూడు మ్యాచ్‌లు రద్దు.. పాకిస్తాన్‌పై తీవ్ర విమర్శలు

Three Matchs called off due to rain in Pakistan Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా జరుగుతుండగా.. భారత్ ఆడే మ్యాచ్‌లు మాత్రం దుబాయ్ వేదికగా నిర్వహిస్తున్నారు. అయితే ఈ ట్రోఫీలో భాగంగా 3 మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి. ఈనెల 25వ తేదీన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మ్యాచ్, ఈనెల 27న పాకిస్థాన్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లు కనీసం ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి. తాజాగా, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా మ్యాచ్ జరుగుతుండగా.. మధ్యలో వర్షం కురిసింది. దీంతో మ్యాచ్ రద్దయింది. ఇలా పాకిస్థాన్‌లో జరిగిన 3 మ్యాచ్‌లు వర్షానికి రద్దు కావడంతో పలువురు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

మరోవైపు, లాహోర్‌ వేదికగా ఆస్ట్రేలియా, అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో 30 నిమిషాల పాటు వర్షం కురిసింది. అయితే కాసేపు కురిసిన ఈ వర్షం కారణంగా మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు. దీంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. వర్షం పడిన తర్వాత నీటిని బయటకు పంపిన తీరు, కవర్లను తీసిన విధానం నవ్వుల పాలైందన్నారు. భవిష్యత్తులో పాకిస్థాన్‌కు ఈవెంట్లు నిర్వహించే అవకాశం ఇవ్వకూడదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అలాగే, ఛాంపియన్స్ ట్రోఫీ2025లో ఆతిథ్య పాకిస్థాన్ జట్టు ప్రదర్శన ఆ దేశ అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచుల్లో భారత్, న్యూజిలాండ్ ఓటమిని చవిచూసింది. ఆ తర్వాత వర్షం కారణంగా బంగ్లాదేశ్‌తో మ్యాచ్ రద్దు అయ్యింది. దీంతో, పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానానికి పరిమితమైంది. దీంతో విమర్శలు వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా పాక్ టీమ్ ఆటతీరుపై రాజకీయ నాయకులు కూడా దృష్టి సారించారు. రిజ్వాన్ సేన దారుణ ఆటతీరు, పీసీబీ వ్యవహారాలను ప్రధాని షెహబాజ్ షరీఫ్ దృష్టికి తీసుకెళ్తామని ప్రధాని రాజకీయ, ప్రజా వ్యవహారాల సల హాదారు రాణా సనావుల్లా వెల్లడించారు. పార్లమెంట్ జట్టు ప్రదర్శనపై చర్చిం చాలని ప్రధాని షెహబాబ్ను కోరుతామని అన్నారు.

పాకిస్థాన్ జట్టు ఓటమిపై ప్రధాని కూడా ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిపారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ కథ ముగిసింది. ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇలాంటి వైఫల్యాలకు జట్టు ఆటగాళ్ల ప్రదర్శన ఒక్కటే కారణం కాదని, పాక్ జట్టు దేశవాలీ వ్యవస్థ పూర్తిగా క్షీణించడం అని వారు చెబుతున్నారు.

Exit mobile version
Skip to toolbar