Team India Next Captain Shubman Gill: ఛాంపియన్ప్ ట్రోఫీలో భారత జట్టు దూసుకెళ్తోంది. అయితే ఈ టోర్నీ పూర్తయిన తర్వాత భారత కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ శకం ముగిసినట్లేనని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే టీ20 కెప్టెన్‌గా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలకగా.. ప్రస్తుతం టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహిస్తున్నాడు. ఇక, వన్డేలకు కూడా త్వరలోనే రోహిత్ శర్మతో పాటు విరాట్ కూడా వీడ్కోలు పలకనున్నారు. ఈ నేపథ్యంలో భారత వన్డే మ్యాచ్‌లకు తదుపరి కెప్టెన్‌గా స్టార్ బ్యాట్స్‌మన్ శుభ్‌మన్ గిల్ నియమించే అవకాశం ఉంది.
పంజాబ్‌కు చెందిన 25 ఏళ్ల శుభ్‌మన్ గిల్.. స్టార్ ఆటగాడి జాబితాలోకి చేరాడు. సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనీ జట్టులో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ముఖ్యమైన ఆటగాడిగా మారినట్లే.. శుభ్‌మన్ గిల్ కూడా ఇప్పుడు భారత క్రికెట్ జట్టుకు యువరాజు అయ్యాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ తమ క్రికెట్ కెరీర్‌లో చివరి అధ్యాయానికి చేరుకున్నందున.. గిల్ తదుపరి కెప్టెన్‌గా ఎదిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఛాంపియన్స్ ట్రోఫీ సిరీస్‌లో భారత్ జట్టుకు శుభమన్ గిల్ వైఎస్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. 2018 అండర్ 19 క్రికెట్ ప్రపంచ కప్‌లో శుభ్‌మన్ గిల్ భారత జట్టుకు వైఎస్ కెప్టెన్‌గా రాణించాడు. ఈ సిరీస్‌లో శుభ్‌మన్ గిల్ 372 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో గిల్ సెంచరీ సాధించాడు.
శుభమన్ గిల్ 2022లో వన్డే క్రికెట్‌లో తనకంటూ ఓ గొప్ప పేరును సాధించుకున్నాడు. వెస్టిండీస్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో శుభమన్ గిల్ మొత్తం 203 పరుగులు చేశాడు. దీంతో శుభమన్ గిల్‌కు మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు లభించింది. గిల్ జింబాబ్వేపై తన తొలి వన్డే సెంచరీని కూడా సాధించాడు. ఆ సిరీస్‌లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు కూడా లభించింది. దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్‌లో గిల్ మొత్తం 80 పరుగులు చేశాడు.
ఆ తర్వాత 2023లో శుభమన్ గిల్ తన విస్పోటక బ్యాటింగ్ ప్రదర్శనతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో గిల్ మొత్తం 207 పరుగులు చేశాడు. ఆ సిరీస్‌లో విరాట్ కోహ్లి తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. జనవరి 18, 2023న న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో గిల్ డబుల్ సెంచరీ సాధించి మొత్తం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో డబుల్ సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా శుభమన్ గిల్ నిలిచాడు. దీని తర్వాత అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో 63 బంతుల్లో 126 పరుగులు చేశాడు. దీంతో శుభమన్ గిల్ 2023 ఆసియా కప్ కోసం టీమిండియాలో చోటును సంపాదించాడు. బంగ్లాదేశ్ ఐదో సెంచరీ పూర్తి చేసిన గిల్.. ఆసియా కప్ సిరీస్‌లో మొత్తం 302 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు.
ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న శుభ్మన్ గిల్ 38 ఇన్సింగ్స్‌లలో 2000 పరుగులు చేయడం ద్వారా.. వన్డే క్రికెట్‌లో అత్యంతవేగంగా 2వేల పరుగులు సాధించిన హషీమ్ ఆమ్లా రికార్డును బద్దలు కొట్టాడు. 2023 వన్డే ప్రపంచ కప్‌లో 9 మ్యాచ్‌లలో 354 పరుగులు చేశాడు 2024 టీ20 ప్రపంచకప్‌లో గిల్ రిజర్వ్ ఆటగాడిగా మాత్రమే చేర్చబడ్డాడు. ఆ తర్వాత జింబాబ్వే సిరీస్‌లో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించి సిరీస్‌ను గెలు చుకున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇంగ్లాండ్‌తో జరిగిన వన్డే సిరీస్ సందర్భంగా గిల్‌కు వైస్ కెప్టెన్సీ లభించింది. ఈ సిరీస్‌లో గిల్ సెంచరీ సాధించిన తర్వాత అంతర్జాతీయ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎదిగాడు.