Steve Smith retires from ODI cricket after Champions Trophy semifinal loss: ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవెన్ స్మిత్ సంచలన ప్రకటన చేశారు. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో దుబాయ్ వేదికగా జరిగిన సెమీ ఫైనల్‌లో భారత్ చేతిలో ఓటమి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
భారత్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత వన్డేల నుంచి తప్పుకుంటున్నట్లు తోటి క్రీడాకారులతో చెప్పినట్లు సమాచారం. అయితే ఈ మ్యాచ్‌లో స్మిత్ అత్యధిక పరుగులు చేయడం విశేషం. కాగా, టెస్ట్, టీ20 మ్యాచ్‌లకు స్మిత్ అందుబాటులో ఉండనున్నారు.
ఆస్ట్రేలియా తరఫున స్టీవ్ స్మిత్ కీలక ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు. 2010లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ ఆల్ రౌండర్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత బ్యాటర్‌గా మంచి గుర్తింపు పొందాడు. మొత్తం 170 మ్యాచ్‌లలో 43.28 సగటుతో 5,800 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 28 వికెట్లు పడగొట్టాడు.
ఆస్ట్రేలియా 2015, 2023 వరల్డ్ కప్‌లను గెలవగా.. ఇందులో స్టీవ్ స్మిత్ కీలక పాత్ర పోషించాడు. 2015 నుంచి వన్డే జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అలాగే 2015, 2021 ఏడాదిలో ఆస్ట్రేలియన్ మెన్స్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అందుకున్నాడు. అంతేకాకుండా 2015లో స్మిత్ నాయకత్వంలో ఐసీసీ మెన్స్ వన్డే టీం ఆఫ్ ది ఇయర్‌లో స్థానం దక్కింది.
2015లో కెప్టెన్‌గా వ్యవహరించిన మైఖేల్ క్లార్క్ తర్వాత స్టీవ్ స్మిత్ వన్డే కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొత్తం 64 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించిన స్మిత్.. 32 మ్యాచ్‌లలో జట్టును గెలిపించగా.. 28 మ్యాచ్‌లలో ఓటమి చెందింది.
The great Steve Smith has called time on a superb ODI career 👏 pic.twitter.com/jsKDmVSG1h
— Cricket Australia (@CricketAus) March 5, 2025