Site icon Prime9

Srilanka Worst Record: చెత్త రికార్డు నమోదు చేసుకున్న శ్రీలంక

srilanka worst record

srilanka worst record

Srilanka Worst Record: భారత్ తో జరిగిన రెండో వన్డేలో ఓటమి మూటగట్టుకున్న శ్రీలంక.. ఓ చెత్త రికార్డును నమోదు చేసుకుంది. ఇప్పటి వరకు ఇండియా పేరుమీద ఉన్న రికార్డును శ్రీలంక అధిగమించింది. కోల్ కతా వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ గెలవగా.. లంక ఓడిపోయింది. ఈ విజయంతో ఇండియా కూడా ఓ రికార్డ్ ను సొంతం చేసుకుంది.

రికార్డ్ సృష్టించిన భారత్

రెండో వన్డే గెలుపుతో ఓ ప్రత్యర్థిపై అత్యధిక గెలుపులు సాధించిన జట్టుగా భారత్ చరిత్రకెక్కగా.. అత్యధిక మ్యాచుల్లో ఓడిన జట్టుగా లంక రికార్డ్ సృష్టించింది. ఇప్పటి వరకు లంకపై భారత్ 95 విజయాలు సాధించింది. ప్రస్తుతం అత్యధిక విజయాలు గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా పేరుంది. కీవిస్ జట్టుపై ఆసీసీ 95 వన్డేల్లో జయకేతనం ఎగరవేసింది.

శ్రీలంక చెత్త రికార్డ్

ఇక రెండో వన్డే ఓటమితో.. శ్రీలంక చెత్త రికార్డును నమోదు చేసుకుంది.

అంతర్జాతీయ క్రికెట్లో ఓ జట్టుపై అత్యధిక ఓటమిలను చవిచూసిన దేశంగా రికార్డులకెక్కింది.

ఇప్పటి వరకు అన్ని జట్లపై కలసి 437 వన్డే మ్యాచుల్లో లంక ఓటమి పాలైంది. 94 టీ20 మ్యాచుల్లో ఓటమిపాలైంది. రెండు ఫార్మాట్లలో కలిపి ఎక్కువ మ్యాచులు ఓడిన జట్టుగా రికార్డ్ సొంతం చేసుకుంది.

రెండో వన్డేలో 4 వికెట్ల తేడాతో భారత్ శ్రీలంకపై గెలుపొందింది. శ్రీలంక 215 పరుగులకే ఆలౌట్ అవ్వగా.. భారత్ 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేధించింది. సొంత గడ్డ మీద భారత్ కు మంచి రికార్డ్ ఉంది. ఇండియాలో జరిగిన సిరీస్ లో వరుసగా 26వ సిరీస్ ను ఇండియా కైవసం చేసుకుంది.

వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక విజయాల శాతం ఉన్న జట్టుగా దక్షిణాఫ్రికాకు పేరుంది. ఆ జట్టుకు 63.41 శాతం ఉంది. ఇక ఎక్కువ విజయాలు నమోదు చేసుకున్న జట్టుగా ఆస్ట్రేలియాకు పేరుంది. భారత్ విజయాల శాతం 55 అవ్వగా.. ఆ తర్వాతే 54 శాతంతో పాకిస్థాన్ ఉంది. ఇక లంక విషయానికి వస్తే విజయాల శాతం 48 కంటే తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది.

Janasena Kiran Royal : రాష్ట్ర రాజకీయాలు మారబోతున్నాయి..కిరణ్ రాయల్ | Prime9 News

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

Exit mobile version
Skip to toolbar