Sourav Ganguly escapes unharmed after car accident on Durgapur Expressway: ప్రముఖ భారత క్రికెటర్ సౌరవ్ గంగూలీ కారు ప్రమాదానికి గురైంది. గంగూలీ కాన్వాయ్‌లోని 2 వాహనాలు ధ్వంసమయ్యాయి. ప్రమాదం తర్వాత 10 నిమిషాల పాటు రోడ్డుపైనే సౌరవ్ గంగూలీ వేచి ఉన్నారు. ఈ ప్రమాదంలో గంగూలీకి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
వెస్ట్ బెంగాల్‌లోని ఓ యూనివర్సిటీ పంక్షన్ కోసం వెళ్తుండగా.. రోడ్డు ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. దుర్గాపూర్ జాతీయ రహాదారిపై గంగూలీ కారుకు ముందుకు ఓ ట్రక్కు అకస్మాత్తుగా రావడంతో గంగూలీ కారు డ్రైవర్ సడెన్ బ్రేకులు వేయడంతో వెనకాల వస్తున్న కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకున్నాయి. అయితే సౌరవ్ గంగూలీ ప్రయాణిస్తున్న కారును మరో కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గంగూలీతో పాటు డ్రైవర్ కూడా సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు భారీగా చేరుకున్నారు.
కాగా, గత నెలలోనే గంగూలీ కూతురు సానా గంగూలీకి సైతం ప్రమాదం జరగగా.. తృటిలో ప్రమాదం తప్పింది. సౌరవ్ గంగూలీ కూతురు కారును బస్సు ఢీకొట్టింది.