Site icon Prime9

Mohammed Siraj: నెం1 ర్యాంక్‌ను కోల్పోయిన సిరాజ్‌.. టాప్‌ ర్యాంక్‌ ఎవరిదో తెలుసా?

hyderabadi team india player siraz ahmad got 1st rank in bowlars list

hyderabadi team india player siraz ahmad got 1st rank in bowlars list

Mohammed Siraj: ఐసీసీ వన్డే బౌలర్ ర్యాంకింగ్స్ లో మార్పులు జరిగాయి. ఇప్పటి వరకు నెంబర్ వన్ ర్యాంకర్ గా కొనసాగిన మహమ్మద్ సిరాజ్ తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు. ప్రస్తుతం తాజాగా ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హాజిల్ వుడ్ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకున్నాడు.

సిరాజ్ స్థానం దూరం.. (Mohammed Siraj)

ఐసీసీ వన్డే బౌలర్ ర్యాంకింగ్స్ లో మార్పులు జరిగాయి. ఇప్పటి వరకు నెంబర్ వన్ ర్యాంకర్ గా కొనసాగిన మహమ్మద్ సిరాజ్ తన స్థానాన్ని పోగొట్టుకున్నాడు.

ప్రస్తుతం తాజాగా ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా స్టార్ బౌలర్ జోష్ హాజిల్ వుడ్ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించుకున్నాడు.

టీమిండియా స్టార్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వన్డేల్లో తన నెం1 ర్యాంక్‌ను కోల్పోయాడు.

ఐసీసీ తాజాగా ప్రకటించిన బౌలర్ల ర్యాంకింగ్స్‌లో.. సిరాజ్‌ను అధిగమించి ఆస్ట్రేలియా స్టార్‌ బౌలర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌ నెం1 స్థానానికి చేరుకున్నాడు.

కాగా విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో కేవలం 3 ఓవర్లలోనే 37 పరుగులు సమర్పించుకున్న సిరాజ్‌.. రెండు స్థానాలు దిగజారి మూడో ర్యాంక్‌కు పడిపోయాడు.

 

ఇక బౌలర్ల ర్యాంకింగ్స్‌లో హాజిల్‌వుడ్‌ 713 పాయింట్లతో తొలి స్థానంలో ఉండగా.. న్యూజిలాండ్‌ స్టార్‌ పేసర్‌ ట్రెంట్‌ బౌల్ట్‌(708 పాయింట్లు) రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. సిరాజ్‌(702) పాయింట్లతో ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌తో కలిసి మూడో స్ధానంలో నిలిచాడు. కాగా చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో వన్డేలో సిరాజ్‌ అద్భుతంగా రాణిస్తే.. మళ్లీ టాప్‌ ర్యాంక్‌కు చేరుకునే అవకాశం ఉంది.

Exit mobile version