Ind Vs NZ 3rd T20 : న్యూజిలాండ్‌తో సొంత గడ్డపై జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ను భారత్ చేజిక్కించుకుంది.
ఇటీవల జరిగిన వన్డే సిరీస్‌ను కూడా 3-0 తేడాతో ఇండియా సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక టీ20 సిరీస్‌ను కూడా 2-1 తేడాతో కివీస్ ని మట్టికరిపించి దక్కించుకుంది.
అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో 166 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.
4 వికెట్లకు 234 పరుగులు చేసిన భారత్ ఈ మ్యాచ్‌ను గెలుపులో యంగ్ బ్యాట్‌మెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగిపోయి అండగా నిలిచాడు.
అలాగే టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా కూడా 4 వికెట్లతో ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను మట్టికరిపించడంతో.. భారీ లక్ష్య ఛేదనతో క్రీజులోకి వచ్చిన కివీస్ 66 పరుగులకే పరిమితమయింది.
దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ భారత్ సొంతం చేసుకోగలిగింది.
(Ind Vs NZ 3rd T20)సెంచరీతో రెచ్చిపోయిన గిల్..
అహ్మదాబాద్ వేదికగా జరిగిన మూడో టీ20లో టీమిండియా భారీ స్కోర్ సాధించింది.
టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ను ఎంచుకుంది.
నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగులు నమోదు చేసింది.
టీమిండియా యువ సంచలనం శుభ్ మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. పరుగుల వరద పారించాడు.
కేవలం 54 బంతుల్లోనే 10 ఫోర్లు, 5 సిక్సర్లతో మెరుపు శతకం చేశాడు. ఆ తర్వాత 63 బంతుల్లోనే 7 సిక్సర్లు, 12 ఫోర్లతో 126 పరుగులతో అజేయంగా నిలిచాడు. తన టీ20 కెరీర్ లో తొలి సెంచరీని సాధించాడు.
ఇషాన్ కిషన్, గిల్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. కేవలం మూడు బంతులను మాత్రమే ఎదుర్కొన్న ఇషాన్ ఒక పరుగు మాత్రమే చేసి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
రాహుల్ త్రిపాఠి 44 (22 బంతులు, 3 సిక్సర్లు, 4 ఫోర్లు), సూర్యకుమార్ యాదవ్ 24 (13 బంతులు, 2 సిక్సర్లు, 1 ఫోర్), హార్దిక్ పాండ్యా 30 (17 బంతులు, 1 సిక్సర్, 4 ఫోర్లు) పరుగులు సాధించారు.
దీపక్ హుడా 2 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు.
కివీస్ బౌలర్లలో బ్రేస్ వెల్, టిక్నర్, సోధి, మిచెల్ చెరో వికెట్ సాధించారు. బౌలర్లు భారీగా పరుగులు ఇచ్చుకున్నారు.
టిక్నర్ 3 ఓవర్లలోనే 50 పరుగులు, ఫెర్గుసన్ 4 ఓవర్లలో 54 పరుగులు సమర్పించుకున్నారు.
కాగా, భారీ లక్ష్యంతో అనంతరం క్రీజులోకి వచ్చిన కివీస్ జట్టు భారత బౌలర్ల ధాటికి 66 పరుగులకే కుప్పకూలింది.
దీంతో 168 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది.
ఈ గెలుపుతో 3 టీ20ల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
భారత బౌలర్లలో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా 4 వికెట్లతో చెలరేగాడు. ఉమ్రాన్ మాలిక్, అర్ష్ దీప్ సింగ్, శివమ్ మావి తలో రెండు వికెట్లు తీశారు.
మరోవైపు భారత ఓపెనర్ శుభ్ మన్ గిల్ చిన్న వయసులోనే రికార్డులను బద్దలు కొడుతున్నాడు.
మూడో టీ20లో న్యూజిలాండ్ పై సెంచరీ చేసిన 23ఏళ్ల ఈ యువ సంచలనం.. అన్ని ఫార్మాట్లలో సెంచరీ చేసిన అతి తక్కువ వయసు ఆటగాడిగా నిలిచాడు.
అలాగే టీ20ల్లో సెంచరీ చేసిన యంగెస్ట్ ఇండియన్ కూడా గిల్ కావడం గమనార్హం. అదే విధంగా టీ20ల్లో భారత్ తరపున ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్ కావడం గమనార్హం.
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/