Site icon Prime9

Rohit Sharma: రెండో వన్డేకి రోహిత్ శర్మ!.. సిరీస్‌పై టీమిండియా కన్ను

rohit sharma 1

rohit sharma 1

Rohit Sharma: విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో వన్డేకు రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నాడు. మెుదటి వన్డేకు వ్యక్తిగత కారణాలతో రోహిత్ దూరమయ్యాడు. రెండో వన్డేలో గెలిచి సిరీస్ సొంతం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది.

రెండో వన్డేకు రోహిత్ శర్మ.. (Rohit Sharma)

విశాఖపట్నం వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న రెండో వన్డేకు రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నాడు. ఆదివారం విశాఖపట్నం వేదికగా రెండో వన్డే జరగనుంది.

భార్య సోదరుడి వివాహ వేడుకల కారణంగా తొలి వన్డేకు రోహిత్‌ శర్మ దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో హార్దిక్ పాండ్యా జట్టును నడిపించాడు.

ఇక శుక్రవారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేఎల్‌ రాహుల్‌, రవీంద్ర జడేజాలు అసాధారణ ఇన్నింగ్స్‌ ఆడి మ్యాచ్‌ను గెలిపించారు.

రెండో వన్డేకు రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అందుబాటులోకి రానున్నాడు. ఇక విశాఖపట్నంతో రోహిత్‌ ప్రత్యేక అనుబంధం ఉంది.

రోహిత్‌ తల్లి పూర్ణిమా శర్మ స్వస్థలం విశాఖపట్నం. అమ్మమ్మ ఇలాకాలో రోహిత్‌ ఇరగదీయాలని క్రికెట్‌ ఫ్యాన్స్‌ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

తొలి వన్డే ఆడిన ఇషాన్‌ కిషన్‌ బెంచ్‌కే పరిమితం కానున్నాడు. ఇది మినహా మిగతా జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

మ్యాచ్‌కు వర్షం ముప్పు..

విశాఖ వేదికగా జరిగే రెండో వన్డేకు వర్షం ముప్పు పొంచి ఉంది.మార్చి 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు విశాఖలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఆదివారం మ్యాచ్‌ జరిగే సమయంలో ఉరుములు, ఈదురు గాలులతో భారీ వర్షం పడే ఛాన్స్‌ ఉంది ఉందని భారత వాతావరణ విభాగం ఓ ప్రకటనలో పేర్కొంది.

మరోవైపు వర్షం పడితే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు.. స్టేడియం నిర్వాహకులు తెలిపారు.

వర్షం నుంచి మైదానాన్ని రక్షించేందుకు అవసరమైన అత్యంత తేలికైన పిచ్‌ కవర్లు తమ వద్ద ఉన్నట్లు ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ కూడా ఓ ప్రకటనలో వెల్లడించింది.

Exit mobile version