Rohit Sharma Confirms KL Rahul Will Open in the 2nd Test match: ఆసీస్‌తో ఐదు టెస్ట్‌ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా.. నేడు రెండో టెస్ట్‌కు సిద్దమైంది. అడిలైడ్‌లో జరిగే ఈ రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గురువారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. బ్యాటింగ్ ఆర్డర్‌పై కీలక వివరాలను వెల్లడించారు. మిడిలార్డర్‌లో తాను బ్యాటింగ్‌కు వస్తానని, యశస్వీ జైస్వాల్‌తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తాడని ప్రకటించాడు. ఈ నిర్ణయం తనకు కష్టమైనా.. జట్టుకు అదే బెస్ట్ అని అభిప్రాయపడ్డాడు.
తొలి టెస్ట్‌లో యశస్వి జైస్వాల్-కేఎల్ రాహుల్ అద్భుతంగా ఆడారని, ముఖ్యంగా రాహుల్ బ్యాటింగ్ ఆకట్టుకుంది. కనుక ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్ ఆర్డర్‌లో మార్పులు చేయాల్సిన అవసరం లేదు’అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. రాబోయే మ్యాచ్‌లలో అవసరమైతే కొన్ని మార్పులు చేసుకుంటామని ప్రకటించాడు.