Prime9

RCB Won against LSG: లక్నోపై ఆర్సీబీ అధిరే విజయం

RCB Won the Match against LSG in IPL 2025 Last League Match: లీగ్ దశ పూర్తయింది. లక్నోపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి లక్నోనే బ్యాటింగ్ కు ఆహ్వానించింది. పంత్ టీం నిర్ణిత 20 ఓవర్లలో 227పరుగులు చేసింది. రిషభ్ పంత్ 61 బంతుల్లో 118 పరుగులు చేశాడు. లక్నో ఓపెనర్లలో మిచెల్ 37 బంతుల్లో 67 పరుగులు, మ్యాథ్యూ 12 బంతుల్లో 14పరుగులకే పెవిలియన్ చేరాడు. పూరన్ 10 బంతుల్లో 13, సమద్ 1 బంతికి 1 నాటౌట్ గా నిలిచాడు. దీంతో లక్నో నిర్ణిత 20 ఓవర్లలో లక్నో 227పరుగులు చేసింది.

 

భారీ లక్ష్య చేధనలో భాగంగా ఆర్సీబీ ఓపెనర్లు రాణించారు. స్టాల్ (30), కోహ్లీ (54) చేశారు. మయాంక్ అగర్వాల్ 23 బంతుల్లో 41*, జితేష్ 85* నాటౌట్ గా నిలిచారు. ఐపీఎల్ చరిత్రలోనే ఇది మూడవ అత్యధిక లక్ష్య ఛేదన. ఆర్సీబీ 9 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. 8 ఓవర్లలో ఆర్సీబీ ఒక వికెట్ నష్టానికి 90 పరుగులు చేయగా… ఒరేర్క్ వేసిన వరుస బంతుల్లో పాటీదార్ (14), లివింగ్ స్టన్ (0) గా వెనుదిరిగారు. ఆతర్వాత వచ్చిన మయాంక్, జితేష్ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మయాంక్ అండగా జితేష్ ఫోర్లతో సిక్సర్లతో విద్వంసం సృష్టించాడు. ఆర్సీబీ ముందు 228 టార్గెట్ చిన్నబోయింది.

 

లక్నో ఇన్నింగ్స్: మిచెల్ మార్ష్ 67; బ్రీజ్కే 14; పంత్ నాటౌట్ 118; పూరన్ 13; సమద్ నాటౌట్ 1

ఎక్స్ట్రాలు 14 మొత్తం: (20 ఓవర్లలో 3 వికెట్లకు) 227;

వికెట్ల పతనం: 1-25, 2-177, 3-226;

బౌలింగ్: తుషార 4-0-26-1, కృనాల్ పాండ్య 2-0-14-0; యశ్ దయాళ్ 3-0-44-0; భువనేశ్వర్ 4-0-46-1; సుయశ్ శర్మ 3-0-39-0; రొమారియో షెఫర్డ్ 4-0-51-1

 

ఆర్సీబీ : సాల్ట్ 30; కోహ్లి 54; రజత్ పాటీదార్ 14; లివింగ్స్టన్ ఎల్బీ 0; మయాంక్ నాటౌట్ 41; జితేశ్ నాటౌట్ 85;
ఎక్స్ ట్రాలు 6 మొత్తం: (18.4 ఓవర్లలో 4 వికెట్లకు) 230;

 

వికెట్ల పతనం: 1-61, 2-90, 3-90, 4-123; బౌలింగ్: ఆకాశ్ 4-0-40-1; ఒరూర్క్ 4-0-74-2; దిగ్వేశ్ 4-0- 36-0, షాబాజ్ 3-0-39-0; అవేష్ 3-0-32-1; బదోని 0.4-0-9-0

Exit mobile version
Skip to toolbar