RCB marketing head Nikhil Arrested in Bengaluru stampede Issue: ఆర్సీబీకి బిగ్ షాక్ తగిలింది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో తొలి కేసు నమోదు చేశారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలేను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఈవెంట్ నిర్వాహక సంస్థ అధికారులను సైతం అదుపులోకి తీసుకున్నారు.
ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే ముంబైకి వెళ్తుండగా.. బెంగళూరులోని ఎయిర్‌పోర్టులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే విక్టరీ పరేడ్‌కు సంబంధించి నిఖిల్ సోసాలే అనధికారిక ప్రమోషన్స్ చేశారని, అనుమతి లేకుండా పరేడ్ నిర్వహించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ఇప్పటికే కొంతమంది అధికారులను కర్ణాటక సర్కార్ సస్పెండ్ చేసింది. అలాగే కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ శంకర్‌తోపాటు ట్రెజరర్ జైరామ్ సైతం పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.