Prithvi Shaw: రంజీ ట్రోపీల్లో టీమ్ఇండియా యంగ్ క్రికెటర్ పృథ్వీ షా (Prithvi Shaw) రికార్డు సృష్టించాడు. రంజీ ట్రోపీ 2022-23 లో భాగంగా అసోం జట్టుపై ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 383 బంతుల్లో 379 పరుగులతో( 49 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం పృథ్వీ షా స్రుష్టించాడు. రంజీ ట్రోఫీ(Ranji Trophy) చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన బ్యాట్స్ మెన్ గా పృథ్వీ షా నిలిచాడు. ఈ సందర్భంగా పృథ్వీని మాజీ క్రికెటర్ సంజయ్ ముంజ్రేకర్ అభినందించాడు. ‘377 పరుగులతో తాను చేసిన రికార్డును.. తాను అభిమానించే ప్లేయర్ బీట్ చేయడం చూసి థ్రిల్ అయ్యానని ఆయన తెలిపారు. కాగా, ముంబయి తరపున ఆడుతున్న పృథ్వీని జాతీయ జట్టులోకి తీసుకోవాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పృథ్వీ చివరిసారిగా 2021 లో భారత్ తరపున టీ20 మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత జట్టులోకి రాలేకపోయాడు.
రికార్డులు బద్దలు
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాళ్ల పేరిట ఉన్న పలు రికార్డులను పృథ్వీ షా( Prithvi Shaw) బద్దలు కొట్టాడు. ముంబై తరపున గతంలో సంజయ్ ముంజ్రేకర్ ఉండగా.. ఇప్పుడు పృథ్వీ షా అయన్ని అధిగమించాడు. అదే విధంగా మరో దిగ్గజ ఆటగాడు సునీల్ గావస్కర్ ( ముంబై తరపున రంజీల్లో 340 పరుగులు) ను కూడా దాటేశాడు. కొంతకాలంగా జాతీయ జట్టులో స్థానం కోసం ఎదురుచూస్తున్న పృథ్వీ షా ఈ అద్భుత ఇన్నింగ్స్ తో సెలెక్టర్లకు సవాల్ విసిరాడు.
అందరూ జడ్జ్ చేస్తారు
పృథ్వీ షా లో టాలెంట్ ఉన్నప్పటికీ వచ్చిన అవకాశాలు తక్కువ. ఐపీఎల్ లో అదరగొట్టేసే పృథ్వీ కి మాత్రం జాతీయ జట్టులో ఎంపికలో నిరాశే ఎదురవుతోంది. దీంతో ఓంటైమ్ లో షా ఆవేదన వ్యక్తం చేశాడు. ఎంత మంచి ఆటతీరు కనపరిచినా.. క్రమశిక్షణతో ఉన్నా.. అవకాశాలు రాకపోతే అభిమానులు కామెంట్స్ చేస్తుంటారని… మన గురించి తెలియని వారు కూడా జడ్జ్ చేస్తుంటారని పృథ్వీ తెలిపాడు.
రంజీల్లో అత్యధిక స్కోరు
1. బీబీ నింబాల్కర్(మహారాష్ట్ర) – 443 నాటౌట్
2. పృథ్వీ షా ( ముంబై) – 379
3. సంజయ్ ముంజ్రేకర్ (బాంబే) – 377
4. ఎంవీ శ్రీధర్ (హైదరాబాద్) – 366
5. విజయ్ మర్చంట్ (బాంబే )- 359 నాటౌట్
ఇవీ చదవండి:
వన్డే కు రెడీ అవుతోన్న ఉప్పల్ స్టేడియం.. హైదరాబాద్ మ్యాచ్ కు పేటీఎమ్ లో టికెట్స్
థియేటర్ లో మాస్ ఎంట్రీ ఇచ్చిన బాలయ్య.. రచ్చ చేసిన ఫ్యాన్స్
Ram Charan-Upasana: నాతో కలిసి నా బిడ్డకూ ఇది స్పెషల్ ఎక్స్ పీరియన్స్.. ఉపాసన ఎమోషనల్ ట్వీట్
ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:
https://www.youtube.com/@Prime9News
https://www.youtube.com/Prime9Digital
ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:
Facebook: https://www.facebook.com/prime9news
Twitter: http://Twitter: https://twitter.com/prime9news
Instagram: https://www.instagram.com/prime9news/