pbks vs mi qualifier 2: IPL 2025: టాస్ గెలిచి పంజాబ్ బౌలింగ్ ఎంచుకోవడంతో.. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ చేయగా.. నిర్ణిత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేశారు. రోహిత్ శర్మ 7బంతులాడి 8 పరుగులు చేసాడు. మార్కస్ వేసిన బౌల్ కు విజయ్ కుమార్ కు చిక్కాడు. జానీ 24బంతులాడి 38పరుగులు చేసాడు. ఫస్ట్ డౌన్ లో దిగిన తిలక్ వర్మ 29 బంతులకు 44పరుగులు చేసాడు. సూర్యకుమార్ యాదవ్ 26 బంతులకు 44పరుగులు చేసాడు. హార్దిక్ పాడ్య 13బంతులాడి 15;పరుగులకు పెవిలియన్ చేరాడు. నమన్ దీర్ 18బంతుల్లో 37పరుగులు చేసారు. రాజ్ బవ 4బంతులకు 8పరుగులు చేసాడు. మిచెల్ 1బంతికి సున్నా పరుగులు చేసాడు.
పంజాబ్ బౌలర్లలో అజ్మతుల్లా రెండు, జేమిసన్, చాహల్, విజయ్ కుమార్, మార్కస్ చెరో ఒక వికెట్ ను పడగొట్టారు.
దీంతో 204 పరుగుల లక్ష్యంతో పంజాబ్ బ్యాటింగ్ చేయనుంది.