Site icon Prime9

ICC Champions Trophy, 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ.. వందిమందికిపైగా పోలీసులపై వేటు!

Over 100 Pakistan Policemen Sacked in ICC Champions Trophy, 2025: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ వేదికగా జరుగుతోంది. 36 ఏళ్ల తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తుంది. అయితే ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్థాన్ జట్టు ఓటమి చెందడంతో ఘోర పరాభవం ఎదురైంది. కనీసం ఆ జట్టు సెమీస్‌కు కూడా అర్హత సాధించలేదనే విషయం అందరికి తెలిసిందే. తాజాగా, మరో విషయం వెలుగులోకి వచ్చింది.

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భద్రత విషయంలో విధులు నిర్వహించేందుకు పంజాబ్ ప్రావిన్స్ పోలీసులను కేటాయించింది. అయితే భద్రతా విధులు నిర్వహించేందుకు నిరాకరించడంతో అక్కడి ప్రభుత్వం పోలీసులపై వేటు వేసింది. దాదాపు వందమందికిపైగా పోలీసులను తొలగిస్తున్నట్లు చెప్పింది. ఇందులో ఉన్న వారంతా పోలీసు దళంలోని వివిధ విభాగాల్లో పని చేస్తున్నట్లు సమాచారం. అయితే పోలీసులకు కేటాయించిన విధులకు హాజరుకాకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల లాహోర్‌లో ఉన్న గడాఫీ స్టేడియం నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనే జట్లు ఉంటున్న హోటళ్ల వరకు అక్కడి ప్రభుత్వం భద్రత నిమిత్తం పోలీసులను కేటాయించారు. అయితే పెద్ద సంఖ్యలో పోలీసులు విధులకు హాజరయ్యారు. కానీ ఇందులో చాలామంది విధులు హాజరుకాలేదనే విషయం తెలిసింది. కావాలనే వారంతా విధులకు హాజరుకాలేదని తెలిసిందని, విదుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరికలు జారీ చేసింది. ఇంటర్నేషనల్ టోర్నీల విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదని పంజాబ్ ప్రావిన్స్ ఐజీపీ ఉస్మాన్ అన్వర్ తెలిపారు.

Exit mobile version
Skip to toolbar