Site icon Prime9

India Squad: ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌.. భారత జట్టు ప్రకటన

India rank

India rank

India Squad: బోర్డర్- గవాస్కర్ ట్రోఫి 2023 తర్వాత.. ఆస్ట్రేలియాతో భారత్ మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది. ఇందుకు సంబంధించి టీమిండియా సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. ఈ సారి తొలి
వన్డేకు హర్దీక్ పాండ్యా కెప్టెన్ గా ఉండనున్నాడు. 18 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది.

తొలి వన్డేకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా.. (India Squad)

ఆసీస్ తో జరిగే మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ కు భారత జట్టును సెలెక్టర్లు ప్రకటించారు. మెుత్తం 18 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ ప్రకటించింది. మెుదటి మ్యాచ్ కు మాత్రం హార్దిక్ పాండ్యా.. కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. మిగతా రెండు వన్డేలకు రోహిత్ శర్మ కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. వాటికి హర్దీక్ పాండ్యా.. వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు. వ్యక్తిగత కారణాల వల్ల రోహిత్‌ శర్మ తొలి వన్డేకు.. దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. అతని స్థానంలో భారత జట్టుకు.. హార్ధిక్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. ఈ ఒక్క విషయం మినహా.. మిగతా జట్టులో ఎలాంటి విశేషాలు లేవు. ఇక ఆస్ట్రేలియాతో తొలి వన్డే.. మార్చి 17న ముంబై వేదికగా జరుగుతుంది. రెండో వన్డే 19న వైజాగ్‌లో.. మూడో వన్డే మార్చి 22న చెన్నైలో జరుగనుంది.

భారత జట్టు ఇదే..

రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), హార్ధిక్‌ పాండ్యా (వైస్‌ కెప్టెన్‌), విరాట్‌ కోహ్లి, శుభ్‌మన్‌ గిల్‌, కేఎల్‌ రాహుల్‌, ఇషాన్ కిషన్‌, అక్షర్‌ పటేల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌, మహ్మద్‌ షమీ, మహ్మద్‌ సిరాజ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, యుజ్వేంద్ర చహల్‌, శార్ధూల్‌ ఠాకూర్‌.

ఆసీస్‌తో చివరి రెండు టెస్టులకు భారత జట్టు ఇదే..

బోర్డర్- గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో భారత్ నాలుగు మ్యాచులు ఆడనున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ లో ఇది వరకే.. రెండు మ్యాచ్ లను టీమిండియా సొంతం చేసుకంది. దీంతో 2-0 ఆధిక్యంలోకి కొనసాగుతోంది. మెుదట రెండు టెస్టులకు భారత జట్టును ప్రకటించిన సెలెక్టర్లు.. ఇవాళ మూడు, నాలుగు టెస్టులకు తదుపరి జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ప్రస్తుతం ఎలాంటి మార్పులు చేయలేదు. తొలి రెండు టెస్ట్‌లకు ప్రకటించిన జట్టునే ఇప్పుడు కొనసాగిస్తున్నారు. మూడో టెస్ట్‌ ఇండోర్‌ వేదికగా మార్చి 1 నుంచి 5 వరకు జరుగుతుంది. నాలుగో మ్యాచ్‌ అహ్మదాబాద్‌ వేదికగా మార్చి 9 నుంచి 13 వరకు జరుగనుంది.

Exit mobile version