South Africa vs New Zealand : ఛాంపియన్స్ ట్రోఫీ రెండో సెమీ ఫైనల్‌లో న్యూజిలాండ్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు. టాస్ గెలిచిన మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలమైన లహోర్ పిచ్‌పై భారీ స్కోర్ నమోదైంది. నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి న్యూజిలాండ్ 362 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెంచరీలతో ఇద్దరూ కందం తొక్కారు. దారిల్ మిచెల్ (49), గ్లెన్ ఫిలిప్స్ 49 పరుగులు చేసి హాఫ్ సెంచరీ మిస్ అయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 3 వికెట్లు తీయగా, రబాడా 2, మల్డర్ ఒక వికెట్ తీశాడు. సౌతాఫ్రికా ఫైనల్ చేరేందుకు 363 పరుగులు చేయాల్సి ఉంది.
South Africa vs New Zealand : దక్షిణాఫ్రికా టార్గెట్ 363
South Africa vs New Zealand