Site icon Prime9

Yuzvendra Chahal-Dhanashree: విడాకులు తీసుకున్న చాహల్‌, ధనశ్రీ వర్మ – వెల్లడించిన క్రికెటర్‌ లాయర్‌

Yuzvendra Chahal And Dhanashree Verma Divorced: భారత క్రికెట్‌, స్పిన్నర్‌ యుజ్వేంద్ర చాహల్‌ భార్య ధనశ్రీ వర్మతో విడిపోయాడు. గురువారం వారికి ముంబైలోని బాద్రా ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని చాహల్‌ తరపు న్యాయవాది నితిన్‌ కుమార్‌ గుప్తా వెల్లడించారు. కొద్ది రోజులుగా చాహల్‌, ధనశ్రీ విడాకుల వార్తలు మీడియా, సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. వీరిద్దరు కొంతకాలంగా నుంచి విడివిడిగా జీవిస్తున్నారని, త్వరలోనే డైవోర్స్‌ తీసుకుని విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరు నేడు బాంద్రా ఫ్యామిలీ కోర్టుకు ముందు హాజరయ్యారు.

పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలనే ఆరు నెలల కూలింగ్‌ ఆఫ్‌ పీరియడ్‌ని ముంబై హైకోర్టు ని రద్దు చేసింది. అదే విధంగా మార్చి 20లోపు వీరి విడాకుల పిటిషన్‌పై తీర్పు ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. దీంతో హైకోర్టు ఆదేశం మేరకు ముంబై కోర్టు నేడు విచారణ చేపట్టి తుది తీర్పు ఇచ్చింది. పరస్పర అంగీకారంతో చాహల్‌, ధనశ్రీలకు విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా ధనశ్రీకి భరణంగా రూ. 4.75 కోట్లు ఇచ్చేందుకు చాహల్‌ అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది. ఆ మొత్తంలో ఇప్పటివరకు రూ.2.47 కోట్లు చెల్లించినట్టు సమాచారం.

కాగా చాహల్‌, ధనశ్రీలు 2020లో పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌, డ్యాన్సరైన ధనశ్రీని చాహాల్‌ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. లాక్‌డౌన్‌లో ధనశ్రీ దగ్గర డ్యాన్స్‌ క్లాసెస్‌కి వెళ్లిన చాహల్‌ అప్పుడే ఆమెతో ప్రేమలో పడ్డాడు. అలా వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత పెళ్లి చేసుకోవాని నిర్ణయించుకుని 2020లో మూడుమూళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వీరి వైవాహిక జీవితంలో కలతలు మొదలయ్యాయి. పెళ్లయిన ఏడాదిన్నర నుంచి ధనశ్రీ, చాహల్‌లు విడివిడిగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో గతేడాది వారు విడాకులు కోరుతూ కోర్టు పిటిషన్ వేయగా.. మార్చి 20న వారికి డైవోర్స్‌ని మంజూరు చేసింది బాంద్రా ఫ్యామిలీ కోర్టు.

Exit mobile version
Skip to toolbar