Kane Williamson: న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్స్ న్ మరో రికార్డు ను సొంతం చేసుకున్నాడు. ఇప్పటికే ఎన్నో రికార్డులన్నీ కేన్ ఖాతాలో ఇది భారీ రికార్డుగా పేర్కొనవచ్చు.
వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడుతూ పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును శతకంతో అసాధారణ పోరాటం చేశాడు.
అయితే ఈ సెంచరీతోనే విలయమ్స్ న్ రికార్డుల్లో కెక్కాడు. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.
రెండో టెస్టులో 25 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో నాల్గోరోజు బరిలోకి దిగిన విలియమ్స్ న్ సెంచరీ బాది న్యూజిలాండ్ టాప్ స్కోరర్ గా నిలిచాడు.
తన కెరీరీలో ఇప్పటివరకు విలయమ్స్ న్ 92 టెస్టులు ఆడాడు. మొత్తం 26 సెంచరీలు, 33 అర్థ సెంచరీలతో 7787 పరుగులు చేసిన కేన్ 53.33 సగటుతో ఉన్నాడు.
విలయమ్స్ న్ తాజా రికార్డుతో కివీస్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్ ను వెనక్కి నెట్టాడు.
112 టెస్టుల్లో 44.66 సగటుతో 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 7683 పరుగులు చేసి ఉన్నాడు. మొదటి, రెండు స్థానాల్లో విలయమ్స్ న్ , రాస్ టేలర్ ఉండగా..
వారి తర్వాత స్థానాల్లో.. 7172 పరుగులతో స్టీఫెన్ ఫ్టెమింగ్ , 6453 పరుగులతో బ్రెండన్ మెక్ కల్లమ్ , 5444 పరుగులతో మార్టన్ క్రో, 5038 పరుగులతో టామ్ లాథమ్ లు ఉన్నారు.
కాగా, రెండో టెస్టులో ఫాల్ ఆన్ ఆడిన న్యూజిలాండ్ కేన్ శతకంతో రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ ను సాధించింది.
483 భారీ స్కోర్ ను సాధించిన న్యూజిలాండ్ ప్రత్యర్థికి 258 పరుగలు టార్గెట్ ను నిర్ధేశించింది.
టార్గెట్ ఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ .. తమదైన స్టయిల్ లో ధాటిగా ఇన్నింగ్స్ ఆరంభించింది.
వరుస బౌండరీలతో విరుచుకుపడిన ఇంగ్లండ్ ఆటగాడు జాక్ క్రాలే (30 బంతుల్లో 24; 5 ఫోర్లు) మరో భారీ షాట్ ఆడే ప్రయత్నంలో ఓటయ్యాడు.
బెన్ డక్కెట్ (23), ఓలీ రాబిన్సన్ (1) ఆచితూచి ఆడుతున్నారు.
నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ ఒక వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. ఇంగ్లండ్ లక్ష్యానికి 210 పరుగుల దూరంలో ఉంది.