Site icon Prime9

Joe Root: చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ రికార్డు బద్దలు

Joe Root surpasses Sachin Tendulkar for this big record in Test cricket: ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ చరిత్ర సృష్టించాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే నాలుగో ఇన్నింగ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా చరిత్రకెక్కాడు. న్యూజిలాండ్‌తో 3 టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా క్రిస్టన్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో జోరూట్ ఈ ఫీట్ సాధించాడు. ఈ మ్యాచ్ నాలుగో ఇన్నింగ్స్‌లో జోరూట్ 15 బంతుల్లో 23 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 3 ఫోర్లు, ఒక సిక్స్ ఉండటం గమనార్హం.

ఈ ఇన్నింగ్స్‌తో జో రూట్.. క్రికెట్ గాడ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ను అధిగమించాడు. 2013లో అంతర్జాతీయ టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన సచిన్ మొత్తం 200 టెస్ట్‌ల్లో నాలుగో ఇన్నింగ్స్‌లో 1625 పరుగులు చేశాడు. తాజాగా జోరూట్ 1630 పరుగులతో సచిన్‌ను అధిగమించాడు. జోరూట్ 149 టెస్ట్‌ల్లోనే ఈ ఫీట్ సాధించడం విశేషం. ఈ జాబితాలో అలిస్టర్ కుక్, గ్రేమ్ స్మిత్ 1611 పరుగులతో మూడో స్థానంలో ఉండగా, శివనారయన్ చంద్రపాల్ 1580 పరుగులతో నాలుగో స్థానంలో ఉన్నాడు.

Exit mobile version