Jasprit Bumrah: మళ్లీ టాప్‌లో జస్ ప్రీత్ బుమ్రా.. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో భారత్ హవా

Jasprit Bumrah regains top spot in ICC Test bowling rankings: ఐసీసీ ర్యాంకుల్లో భారత్, ఇంగ్లండ్ ఆటగాళ్ల హవా కొనసాగుతోంది. ఐసీసీ ర్యాంకింగ్స్‌లో బౌలింగ్‌లో భారత్ స్టార్ బౌలర్, పేసర్ జస్ ప్రీత్ బుమ్రా మళ్లీ టాప్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. ప్రస్తుతం బుమ్రా.. 890 పాయింట్లతో మొదటి ర్యాంకు కైవసం చేసుకోగా.. కగిసో రబాడ 856 పాయింట్లకే పరిమితమయ్యాడు.

తాజాగా, అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్ మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ 797 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నాడు. అలాగే రవీంద్ర జడేజా 786 పాయింట్లతో టాప్‌లో కొనసాగుతున్నాడు.

ఇక, బ్యాటర్ల విషయానికొస్తే.. ఐసీసీ ప్రకటించిన టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో జో రూట్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా.. భారత్ నుంచి టాప్ 10లో యశస్వి జైస్వాల్ 811 పాయింట్లు, రిషభ్ పంత్ 724 పాయింట్లతో ఉన్నారు.

అలాగే, టెస్ట్ ఫార్మాట్ ఆల్ రౌండర్ల జాబితాలో భారత ఆటగాళ్లు రవీంద్ర జడేజా 415 పాయింట్లతో టాప్ లో కొనసాగుతుండగా.. అశ్విన్ 283 పాయింట్లతో మూడో స్థానం, అక్షర్ పటేల్ 234 పాయింట్లతో పదో స్థానంలో ఉన్నాడు. దీంతో పాటు టీ20 బ్యాటింగ్ జాబితాలో ట్రావిస్ హెడ్ 855 పాయింట్లతో టాప్ లో ఉండగా.. ఫిల్ సాల్ట్ 829 పాయింట్లతో తర్వాతి స్థానంలో ఉన్నాడు. ఇక, తిలక్ వర్మ 806 పాయింట్లతో మూడో స్థానం, సూర్యకుమార్ యాదవ్ 788 పాయింట్లతో నాలుగో స్థానం, జోస్ బట్లర్ 717 పాయింట్లతో ఐదో స్థానంలో ఉన్నారు.