Jasprit Bumrah earns ICC Cricketer of the Year nomination: భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రా ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వివరాలను ఐసీసీ తన వెబ్ సైట్ లో వివరించింది. గతేడాది గాయం నుంచి కోలుకుని బుమ్రా 2024లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చాడు.ఈ ఏడాదిలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా రికార్డు నెలకొల్పాడు.
ప్రధానంగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు స్వదేశంలో రాణించాడు. ఈ ఏడాది వరుసగా వికెట్లు పడగొట్టాడు. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో చెలరేగి బౌలింగ్ చేస్తున్నాడని ఐసీసీ పేర్కొంది. పెర్త్ టెస్ట్ లో అద్భుతమైన బౌలింగ్ తో బుమ్రా.. భారత్ కు 295 పరుగుల భారీ విజయాన్ని అందించాడని ఐసీసీ గుర్తు చేసింది.
అలాగే ఈ ఏడాది టెస్ట్ క్రికెట్‌లో ప్రతిభ కనబరిచి బుమ్రా అత్యుత్తమ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. 2024లో మొత్తం 13 టెస్ట్ మ్యాచ్‌ల్లో14.92 యావరేజ్‌ో 71 వికెట్లను బుమ్రా పడగొట్టాడు. ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీో సైతం నాలుగు టెస్ట్ ల్లో 30 వికెట్లు పడగొట్టి టాప్ బౌలర్ గా నిలిచాడు. ఇఖ, బుమ్రాతో పాటు ఇంట్లాండ్ క్రికెటర్లు జో రూట్, హ్యారీ బ్రూక్, శ్రీలంకకు చెందిన కమిందు మెండిస్ ఈ అవార్డుకు నామినేట్ అయినట్లు ఐసీసీ తెలిపింది.