Site icon Prime9

Isle of Man: 2 బంతుల్లో ముగిసిన మ్యాచ్.. టీ20ల్లో అత్యంత చెత్త ఘనత

Isle of Man

Isle of Man

Isle of Man: ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్ లో అతి చెత్త రికార్డు నమోదు అయింది. కేవలం 2 బంతుల్లో మ్యాచ్ ముగియడంతో చెత్త ఘనతను సొంతం చేసుకుంది ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు. స్పెయిన్ తో జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లో 10 పరుగులకే చాప చుట్టేసుంది. అందులో కూడా ఆరుగురు ప్లేయర్స్ డకౌట్ కాగా.. మిగిలిన వాళ్లు ఒక్క పరుగు కే పరిమితం అయ్యారు. పురుషుల టీ20 మ్యాచ్ ల్లో ఓ జట్టు చేసిన అత్యంత తక్కువ స్కోరు ఇదే.

అందరూ క్యూ కట్టారు(Isle of Man)

ఆరు మ్యాచ్ ల సిరిస్ కోసం ఐల్ ఆఫ్ మెన్స్ జట్టు స్పెయిన్ పర్యటనకు వచ్చింది. ఈ సిరీస్ లో భాగంగా ఐదు మ్యాచ్ లను స్పెయిన్ గెలుచుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన ఆరో మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ ఎంచుకుంది ఐల్ ఆఫ్ మ్యాన్ జట్టు.

8.4 ఓవర్ల లో కేవలం 10 పరుగులకు అన్నీ వికెట్లను కోల్పోయింది ఆ జట్టు. జోసెఫ్ బుర్రోస్ 4 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు.

జాకప్ బట్లర్, జార్జ్ బుర్రోస్ (2) పరుగుల చొప్పున చేశారు. మిగిలిన వారంతా ఒక్క పరుగు కూడా చేయకుండా వెనుదిరిగారు.

తొలి బంతే నో బాల్​

ఇక స్పెయిన్ 11 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి… కేవలం రెండు బంతుల్లో మ్యాచ్ ను ముగించింది. ఐజిల్​ ఆఫ్​ మ్యాన్​ జట్టు తొలి బంతినే నో బాల్​గా వేసింది.

ఆ తర్వాత వేసిన రెండు బంతులను బ్యాటర్​ అవైస్ అహ్మద్​ రెండు సిక్స్​లు బాదగా.. 10 వికెట్లు తేడాతో స్పెయిన్ ఘన విజయం సాధించింది.

ఇక స్పెయిన్ బౌలర్లు మహ్మద్​ కర్రాన్​, ఆటిఫ్ మహ్మద్ చెరో నాలుగు వికెట్లు పడగొట్టారు. లార్న్​ బర్న్స్​ 2 వికెట్లు తీశాడు.

ప్లేయర్​ ఆఫ్​ ది మ్యాచ్​గా నాలుగు వికెట్లు పడగొట్టిన ఆటిఫ్​ అహ్మద్​ నిలిచాడు.

స్వదేశంలో జరిగిన 6 మ్యాచ్ ల సిరీస్ స్పెయిన్ 5-0 తో గెలుచుకుంది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దు అయింది.

 

Exit mobile version