Site icon Prime9

IPL 2025: సూర్యవంశీకి సేహ్వాగ్ క్లాస్

sehwag warning to suryavanshi build career for ipl

sehwag warning to suryavanshi build career for ipl

IPL 2025: ఐపీఎల్ చరిత్రలో అత్యంత చిన్న వయస్సుగల క్రికెటర్, వైభవ్ సూర్య వంశీ. 14ఏళ్లకే ఐపీఎల్ లో తన సత్తాచాటుతున్నాడీ పాలబుగ్గల పసివాడు. అయితే వైభవ్ కు క్లాస్ పీకాడు మాజీ టీమిండియా డ్యాషింగ్ ఓపెనర్ సెహ్వాగ్. వచ్చీ రాగానే సిక్సులతో రెచ్చిపోవడమేంటని మందలించాడు. చాలా సంవత్సరాలు ఆడేవిధంగా ప్లేయర్ మెంటాలిటీ ఉండాలన్నాడు. ఇప్పటివరకు తాను కొంత మంది ఆటగాళ్లను చూశానన్నాడు.  రెండు మ్యాచుల్లో సత్తా చాటి మళ్లీ కళ్లకు కనపడకుండా పోయారని అన్నాడు. బాగా ఆడినప్పుడు అందరూ పొగుడుతారని, ఆడనప్పుడు వాళ్లే తిడతారని చెప్పాడు. పొగిడినప్పుడు పొంగిపోయి అతి చేయకుండా, తిట్టి నప్పుడు కృంగిపోకుండా ఉండాలన్నాడు.

 

యువ క్రికెటర్లు విరాట్ కోహ్లీని ఆదర్శంగా తీసుకోవాలన్నాడు సేహ్వాగ్. విరాట్ క్రీజులోకి వచ్చిన ప్రతీసారి మంచి స్కోర్ చేసేందుకు ప్రయత్నిస్తాడన్నారు. కోహ్లీ తన 17ఏట ఐపీఎల్ లోకి వచ్చాడని ఇప్పటికి 18ఏళ్లు పూర్తి చేసుకున్నాడని చెప్పాడు. ఐపీఎల్ లో రెండు మ్యాచులు బాగా ఆడాం కోట్లు సంపాదించాం, అభిమానులను సంపాదించుకున్నాం ఇప్పుడు నాకు ఎదురు లేదనుకుంటే.. ఇక ఆడలేరని మందలించాడు. మొదటి బంతికే సిక్స్ కొంటాలని టార్గెట్ పెట్టుకుంటే వచ్చే ఏడాది ఆడటానికి అవకాశం రాదన్నాడు.

 

లక్నోతో ఆడిన మ్యాచులో 20 బంతుల్లో 34 పరుగులు చేశాడు వైభవ్. తాను ఎదుర్కున్న రెండో బంతికే సిక్స్ బాదాడు. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్ లో భువనేశ్వర్  బౌలింగ్ లో రెండు సిక్సర్లు కొట్టాడు. ఆతర్వాత బౌల్డ్ అయ్యాడు. ఐపీఎల్ లో యంగెస్ట్ క్రికెటరైన సూర్యవంశికి రూ.1.1 కోటికి  ప్రాంచేజీ దక్కించుకుంది. వైభవ్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. సంజూ శాంసన్ కు గాయమవడంతో వైభవ్ కు అవకాశం వచ్చింది. 2025 సీజన్ లో మొదటి 9 మ్యాచుల్లో 7 ఓడిపోవడంతో ప్లే ఆఫ్ రేసునుంచి తప్పుకుంది. మిగిలిన మ్యాచుల్లో గెలిచినా ప్లేఆఫ్ కు చేరుకునే అవకాశం లేదు.

 

Exit mobile version
Skip to toolbar